సినిమాకు వెయిట్ పెంచారు!

  • October 5, 2019 / 04:04 PM IST

ఆనాటి కాలంలో హీరోలు బరువు పెరగకుండా శరీరాన్ని అదుపులో ఉంచుకునేవారు. తగ్గడానికి కూడా వెనకడుగు వేసేవారు. రూపం మార్చితే అభిమానులకు నచ్చదని బాడీతో ప్రయోగాలు చేసే వారు కాదు. ఇప్పుడు అభిమానుల టేస్ట్ మారింది. ట్రెండ్ కి తగ్గట్టు తమ హీరో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నేటి సినీ స్టార్లు కథ కోసం బరువు తగ్గుతున్నారు.. పెరుగుతున్నారు. సినిమాకు వెయిట్ ను పెంచుతున్నారు.

సల్మాన్ ఖాన్బాడీతో ఎక్కువ ఆటలు ఆడే హీరో సల్మాన్ ఖాన్. ఒక సినిమాకు మరో సినిమాకు బాడీ వెయిట్ లో తేడా చూపిస్తుంటారు. సల్మాన్ తాజా సినిమా సుల్తాన్ కోసం ఆరు కిలోలు పెరిగారు. అంటే 88 కిలోలు ఉన్నకండల వీరుడు ‘సుల్తాన్’ షూటింగ్ సమయానికి 94 కిలోలకు చేరుకున్నారు. అదే సినిమాలో యంగ్ రెజ్లర్ గా కనిపించడానికి 24 కిలోలు తగ్గారు. 70 కిలోల వద్ద కూడా సల్మాన్ ఖాన్ హ్యాడ్సమ్ గా ఆకట్టుకుంటున్నారు.

అమీర్ ఖాన్బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న నటుడు అమీర్ ఖాన్. వైవిధ్య కథలను ఎంచుకుంటూ .. సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ హిట్ అందుకున్నారు. లేటెస్టుగా భారత రెజ్లింగ్ వీరుడు, ఒలింపిక్స్ సీనియర్ కోచ్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ‘దంగల్’ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం 13 నెలలు కష్టపడి 30 కిలోలు పెరిగారు. 68 కిలోలతో ఫిట్ గా ఉండే అమీర్ 98 కిలోలకు చేరుకుని మల్లయోధునిగా కనిపిస్తున్నారు. ఇరవై ఏళ్ల యువకుడిగా కనిపించడానికి బరువు పెరగక ముందే కొన్ని కిలోలు తగ్గి షూటింగ్ లో పాల్గొన్నారు.

ప్రభాస్ఆరడుగుల అందగాడు ప్రభాస్. హైట్ కి తగ్గ వెయిట్ తో అమ్మాయిల మనసు దోచే యంగ్ రెబల్ స్టార్ బాహుబలి కోసం ఫుడ్ డోస్ పెంచారు. ఈ సినిమాకు ముందు ప్రభాస్ బరువు 100 కేజీల కంటే తక్కువ. బాహుబలి – ది బిగినింగ్ కోసం 30 కేజీలు పెరిగి 130 కి చేరుకున్నారు. అంతటితో ఆగ లేదు. బాహుబలి – ది కంక్లూజన్ కోసం మరో 20 కేజీలు పెరిగారట. 150 కేజీల ప్రభాస్ శత్రువులను చీల్చి చెండాడనున్నాడు.

రానాకుర్ర అమితాబ్ బచ్చన్ లా ఉండే రానా భల్లాల దేవ కోసం ఫిజిక్ ని మార్చుకోక తప్పలేదు. 86 కిలోలతో స్లిమ్ గా ఉండే రానా ఎప్పుడూ తిననంత తిని 40 కిలోలు పెరిగారు. బాహుబలి రెండు పార్టులకు మధ్య లభించిన గ్యాప్ లో రానా “ఘాజి” సినిమా కోసం బరువు తగ్గి .. ఇప్పుడు మళ్లీ పెరిగారు.

విక్రమ్చియాన్ విక్రమ్ శంకర్ “ఐ” సినిమా కోసం బాడీతో ఆటలు ఆడారు. ఫిట్ గా ఉండే విక్రమ్ ఈ సినిమా బాడీ బిల్డర్ గా, మోడల్ గా, కురూపిగా కనిపిస్తారు. ఇందుకోసం ఒక దశలో 85 కిలోలకు పెరిగి.. మళ్లీ 35 కిలోలు తగ్గే సాహసం చేశారు. 50 కేజీల బరువుతో అద్భుతంగా నటించారు.

సూర్యగజని చిత్రం కోసం శరీరాన్ని శిల్పం లా మలుచుకున్న నటుడు సూర్య. ఆ తర్వాత సూర్య సన్నాఫ్ కృష్ణన్ కోసం బాడీ బరువులో హెచ్చు తగ్గులను చూపించారు. యంగ్ సూర్యగా ఆకట్టుకున్నాడు. మళ్లీ “24” చిత్రంలోనూ కాస్త బరువు పెరిగి.. తగ్గి పాత్రల్లో వేరియేషన్ చూపించారు.

నాగ చైతన్య యువ సామ్రాట్ నాగ చైతన్య షూటింగ్ దశలో ఉన్న సినిమా “ప్రేమమ్”. ఈ మూవీలో చైతూ కొన్ని సంవత్సరాల గ్యాప్ లో ముగ్గురితో ప్రేమలో పడుతారు. టీనేజ్, కాలేజ్ స్టూడెంట్, మిడిల్ ఏజ్ దశల్లో వయసు తేడా కనిపించేందుకు యువ సామ్రాట్ కృషి చేస్తున్నారు. మిడిల్ ఏజ్ కోసం దాదాపు 5 కిలోలు పెరిగిన యువ సామ్రాట్ టీనేజ్ లో ప్రేమలో పడే సన్నివేశాల కోసం ఏకంగా 16 కిలోల బరువు తగ్గాడు. 16 ఏళ్ల కుర్రాడిలా మారిన నాగ చైతన్యని చూసి చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారట. మనం కూడా టీనేజ్ చైతూని చూడాలంటే ఆగస్టు దాకా ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus