Hidimba Collections: ‘హిడింబ’.. మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
July 23, 2023 / 08:52 PM IST
|Follow Us
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. ‘హిడింబ’ ట్రైలర్ బాగుంది. సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. జూలై 20న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.
కానీ వర్షాల వల్ల.. సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది అని చెప్పాలి.కానీ స్టడీగానే కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.51 cr
సీడెడ్
0.23 cr
ఆంధ్ర
0.45 cr
ఏపీ + తెలంగాణ
1.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.11 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.30 cr
‘హిడింబ’ (Hidimba) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.1.30 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఓ పక్కన ‘బేబీ’ మరో పక్క వర్షాల ఎఫెక్ట్ వల్ల ‘హిడింబ’ ఎక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. కానీ మూడో రోజు గ్రోత్ చూపించింది. ఆదివారం రోజున కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి.