Hidimbha: హిడింబ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
July 21, 2023 / 08:34 PM IST
|Follow Us
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. జూలై 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
అశ్విన్ సినిమాలు చాలా వరకు థియేట్రికల్ పరంగా కమర్షియల్ సక్సెస్ సాధించాయి. దీంతో ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
0.80 cr
సీడెడ్
0.46 cr
ఆంధ్ర
1.00 cr
ఏపీ + తెలంగాణ
2.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
2.56 cr
‘హిడింబ’ (Hidimbha) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం ఈజీనే. పైగా టీజర్, ట్రైలర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకి బజ్ బాగానే క్రియేట్ అయ్యింది కానీ మరోపక్క ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు కొంత టెన్షన్ పెడుతున్నాయి అని చెప్పాలి.