నాగశౌర్య సినిమా విడుదల చేయొద్దని హిజ్రాల డిమాండ్!

  • August 28, 2018 / 12:49 PM IST

ఈమధ్యకాలంలో కథ లేకుండా రిలీజైన సినిమాలైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ.. కాంట్రవర్సీ లేకుండా మాత్రం సినిమాలు రిలీజవ్వడం లేదు. మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న “@నర్తనశాల” సినిమా విషయంలోనూ ఇదే తరహాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ సినిమాలో నాగశౌర్య గే (హిజ్రా)గా నటిస్తున్న విషయాన్ని టీజర్ ద్వారా తెలియజేశారు చిత్రబృందం. అప్పట్నుంచి ఈ సినిమా విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి కానీ.. ఇప్పుడు గొడవ కాస్త పెద్దదయ్యింది.

ఇవాళ కొందరు హిజ్రాలు ప్రెస్ క్లబ్ వద్ద ధర్నాకు దిగి.. “నర్తనశాల” చిత్రంలో తమ జాతిని చాలా తక్కువ చేసి చూపించారు, ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరడంతోపాటు.. తమను తక్కువ చేసి చూపించిన సన్నివేశాలు డిలీట్ చేయకపోతే పొరపాటున కూడా సినిమాను విడుదల చేసిన థియేటర్ల వద్ద కూడా ధర్నాకి దిగుతామని బెదిరించారట హిజ్రాలు. మరి ఈ సమస్య నుంచి తప్పించుకొని “@నర్తనశాల” విడుదలవుతుందా లేదా అనేది రేపటికల్లా క్లారిటీ వస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus