HIT2: ఆ తప్పు వల్లే హిట్2 మూవీకి నష్టం జరుగుతోందా?

  • December 5, 2022 / 09:46 AM IST

అడివి శేష్ నటించిన హిట్2 మూవీ పాజిటివ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే హిట్2 మేకర్స్ చేసిన తప్పు గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం. హిట్2 మూవీకి ట్విస్ట్ హైలెట్ అనే సంగతి తెలిసిందే.

ట్విస్ట్ ను రివీల్ చేయవద్దని మేకర్స్ పదేపదే రిక్వెస్ట్ చేయడంతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఆ ట్విస్ట్ ను రివీల్ చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని చంపేయడం హాట్ టాపిక్ అవుతోంది. హిట్2 మేకర్స్ ట్విస్ట్ గురించి పదేపదే ప్రస్తావించకుండా ఉండి ఉంటే మాత్రం సినిమాకు ప్లస్ అయ్యి ఉండేదని కామెంట్లు వినిపిస్తాయి. పోకిరి, టెంపర్ సినిమాలతో పాటు ఎన్నో సినిమాలకు ట్విస్ట్ లు హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాల మేకర్స్ సినిమాల రిలీజ్ కు ముందు ట్విస్ట్ గురించి పదేపదే చర్చించలేదు.

హిట్2 మేకర్స్ కూడా అదే పని చేసి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. హిట్2 కలెక్షన్ల విషయంలో నాని సంతోషంగానే ఉన్నారని సమాచారం అందుతోంది. హిట్3 సినిమాలో లేడీ విలన్ ను పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.సమంతను ఈ పాత్రకు ఎంపిక చేస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.

సమంత కూడా తన సినీ కెరీర్ లో భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నాని సమంత కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో ఒక సినిమా సక్సెస్ సాధిస్తే మరో సినిమా ఫ్లాప్ అయింది. నాని సమంత కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus