Ashwini: 45 ఏళ్ళ వయసులో కూడా ‘హిట్లర్’ ఫేమ్ అశ్విని ఎంత అందంగా ఉందో చూడండి!

  • May 16, 2023 / 02:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘హిట్లర్’ సినిమా అతనికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా అదే పేరుతో తెరకెక్కిన ‘హిట్లర్’ ను తెలుగులో చిరు రీమేక్ చేయడం జరిగింది. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకుడు.చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తన ఐదుగురు చెల్లెళ్లకు అన్నీ తానై పెంచి పెద్ద చేసిన అన్నయ్య పాత్రలో చిరు ఈ చిత్రంలో కనిపిస్తారు. తన చెల్లెళ్ళ జోలికి ఎవరైనా వస్తే వాళ్లకు దేహశుద్ధి చేస్తుంటాడు.

కానీ కొన్ని కారణాల వల్ల తన చెల్లెళ్లకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే ‘హిట్లర్’ కథ. ఇక ఈ చిత్రంలో చిరంజీవికి పెద్ద చెల్లిగా అశ్విని అనే ఆమె నటించింది. ఈమె బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ‘అంతరంగాలు’ సీరియల్ తో ఆమె బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ మూవీ ‘పెళ్లి చేసుకుందాం’ లో కూడా ఈమె ఓ కీలక పాత్ర పోషించింది.

తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ రెండు చోట్లా పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. అటు తర్వాత ఈమె సినిమాల్లో నటించడం మానేసింది. అటు తర్వాత ఈమె పెళ్లి చేసుకుంది సింగపూర్ లో సెటిల్ అయ్యింది. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు 45 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా అందమైన ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. (Ashwini) ఆమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus