పవన్ కల్యాణ్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకొస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. సినిమా ఖర్చు, క్వాలిటీ విషయంలో పీఎస్పీకే27 టీమ్ అస్సలు తగ్గడం లేదు. రాబిన్ హుడ్ కాన్సెప్ట్‌తో పీరియాడిక్ ఫిలింగా రూపొందిస్తున్నారు. సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉందట. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నప్పుడు వీఎఫ్ఎక్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను రప్పిస్తున్నారట.
పవన్ సినిమాకు “స్టార్ వార్స్, ఆక్వామ్యాన్, బంబుల్ బీ, డి వాండెరింగ్ ఎర్త్” వంటి భారీ బడ్జెట్ హిట్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిన బెన్ లాక్ వర్క్ చెయ్యనున్నాడు. ఆల్రెడీ అతడికి క్రిష్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడట. త్వరలో అతడు సినిమా వర్క్ స్టార్ట్ చేశాడని సమాచారం. పవన్ కల్యాణ్ మీద పదిహేను రోజుల పాటు క్రిష్ సినిమా షూటింగ్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ చెయ్యాల్సిన సన్నివేశాలు కొన్ని ఆ పదిహేను రోజుల్లో షూట్ చేశారు.
అనుకోకుండా కరోనా రావడంతో సినిమా షూట్ ఆగింది. ప్రజెంట్ పవన్ షూటింగ్ చేసే మూడ్‌లో లేరు. షూటింగ్ స్టార్ట్ చేసిన తరవాత కూడా ముందుగా ‘వకీల్ సాబ్’ స్టార్ట్ చెయ్యనున్నాడు. పవన్ అది కంప్లీట్ చేసేలోపు పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజాతో క్రిష్ మరో సినిమా కంప్లీట్ చెయ్యనున్నాడు.