Hostel Days Review in Telugu: హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • July 14, 2023 / 01:42 PM IST

Cast & Crew

  • దరహాస్ మాటూరు (Hero)
  • అనన్య అకుల (Heroine)
  • మౌళి తనూజ్, అక్షయ్ లగుసాని , ఐశ్వర్య హోలాకాల్ మరియు జైత్రి మకానా తదితరులు (Cast)
  • ఆదిత్య మండల (Director)
  • అరుణబ్ కుమార్ (Producer)
  • సిద్ధార్థ సదాశివుని (Music)
  • ఫహాద్ అద్బుల్ మజీద్ (Cinematography)

కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ‘ప్రేమ దేశం’ ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ ‘హ్యాపీ డేస్’ వంటి సినిమాలు చరిత్ర సృష్టించాయి. అయితే వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలయ్యాక ఈ బ్యాక్ డ్రాప్ తో ఎక్కువ సిరీస్ లు వచ్చింది లేదు. కాలేజ్ క్యాంపస్ .. హాస్టల్ లైఫ్ అనగానే అందరూ శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ మూడ్ కి వెళ్ళిపోతారు. కానీ దానికి కొంచెం భిన్నంగా రూపొందిందే ‘హాస్టల్ డేస్’ వెబ్ సిరీస్ అని చెప్పాలి. ఇదే పేరుతో హిందీలో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. దాని స్ఫూర్తితోనే ఈ సిరీస్ కూడా రూపొందింది. మరి ప్రేక్షకులను ఈ సిరీస్ ఎంత వరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: 5 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్..6 మంది విద్యార్థుల హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో రూపొందింది అని చెప్పాలి. కావ్య .. రితిక .. మోనిక .. సాయి రామ్ .. చిత్తరంజన్ .. నవీన్ యాదవ్ .. వీళ్లంతా కూడా కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతారు. అలాగే కాలేజీకి చెందిన హాస్టల్లోనే అడ్మిషన్ కూడా పొందుతారు. ఇక్కడ వీరికి సీనియర్స్ డామినేషన్ ఎలా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల ప్రభావం వీళ్ళని ఎలాంటి పక్కదోవ పట్టిస్తుంది. స్నేహం, ప్రేమ, స్వేచ్ఛ, లక్ష్యం వంటి అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది.

నటీనటుల పనితీరు: ప్యూన్ గా చేసిన రఘు కారుమంచి .. వాచ్ మెన్ గా చేసిన తాగుబోతు రమేష్ .. స్టేషనరీ షాప్ కి నడుపుకునే పాత్రలో ఝాన్సీ .. అందరికీ తెలిసిన వారు కాబట్టి వాళ్ళ పాత్రలు వెంటనే రిజిస్టర్ అయిపోతాయి. రాజీవ్ కనకాల కూడా గెస్ట్ రోల్ ఇచ్చారు.దరహాస్ మాటూరు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్, అనన్య అకుల, ఐశ్వర్య హోలాకాల్ వంటి వారు బాగానే చేశారు. అయితే జైత్రి మకానా తన మార్క్ నటనతో మంచి మార్కులు వేయించుకుంటుంది. సిరీస్ కి ఈమె పాత్ర హైలెట్ అని చెప్పాలి. భవిష్యత్తులో ఈమెకు మరిన్ని మంచి పాత్రలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు ఆదిత్య మండల హిందీలో సక్సెస్ అయిన సిరీస్ స్ఫూర్తితో హాస్టల్ డేస్ ను మలిచాడు.కానీ సక్సెస్ ఫుల్ సిరీస్ ను తీసుకున్నప్పుడు కొత్త ఫేస్ లతో కథనాన్ని నడిపించాలి అనుకోవడం అనేది ఛాలెంజింగ్ విషయం. అయితే ఆ ఛాలెంజ్ ను అతను సీరియస్ గా తీసుకుని కొత్త వాళ్ళ నుండి కూడా ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ ను రాబట్టాడు. బడ్జెట్ కి తగ్గట్టు సన్నివేశాలు డిజైన్ చేసుకోవడం అనేది కూడా దర్శకుడికి ఉండాల్సిన మంచి అలవాటు. అది ఆదిత్యకి ఉంది అని ప్రతి సన్నివేశం చెబుతుంది. సిద్ధార్థ సదాశివుని నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ఫహాద్ అద్బుల్ మజీద్ సినిమాటోగ్రఫీ కూడా ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనబడటంలో సహాయపడింది.

విశ్లేషణ: యూత్ కి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. అలాగే మిగిలిన వారికి కూడా తమ కాలేజీ డేస్ ను గుర్తుచేసే విధంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది నిస్సందేహంగా చూసేయండి.

రేటింగ్ : 3/5

Click Here To Read in ENGLISH 

Watch Here

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus