లో బడ్జెట్ లో గూఢచారి కంప్లీట్ వెనుక అసలు రహస్యం ఇదే

  • August 18, 2018 / 01:15 PM IST

క్షణం తర్వాత అడవి శేష్ చేసిన సినిమా గూఢచారి. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమా ఈ చిత్రం 40 కోట్లు రాబట్టి దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన తర్వాత బడ్జెట్ కనీసం 20 కోట్ల పైనే అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆరు కోట్లతో పూర్తి అయిందని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆంత తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించగా.. ఆ రహస్యాన్ని దర్శకుడు శశికాంత్‌ వెల్లడించారు. “యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరు పరిమితులను గుర్తు పెట్టుకుని తమ సినిమా లాగా భావించి, వేరేవాళ్లు చేయాల్సిన పనులు కూడా తమ నెత్తి మీద వేసుకుని చేయటం వల్లే పనివాళ్ల సంఖ్య తగ్గింది. 80 మంది ఉండాల్సిన టీమ్ లో 25 మందే ఉన్నా.. ఆ లోటు కనిపించకుండా మేనేజ్ చేయటంలో ప్రతి ఒక్కరి కృషి ఏంతో ఉంది.

హీరో అని ఫీల్ కాకుండా అడవి శేష్ కెమెరా మోయటం లాంటి పనులు చేశారు. అలా చేయటం వల్ల మిగిలిన వాళ్లు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు” అని వివరించారు. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు తన ఇల్లే విడిదిగా మార్చి హీరో శేష్ తో సహా కెమెరామెన్ ఎడిటర్ లకు వసతి కల్పించానని గుర్తు చేసారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ తన కాస్ట్యూమ్స్ ని స్వయంగా తెచ్చుకునేదని, అసిస్టెంట్లు సైతం సినిమాకు పనికి వస్తాయని అనిపించే ప్రతి వస్తువును వాళ్ళ ఇళ్లలో నుంచి తెచ్చిచ్చేవారని ఆరకంగా మీరు సినిమాలో చూసే ఇన్ సైడ్ ప్రాపర్టీస్ అన్ని అలా తెచ్చినవే అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసారు. అందువల్లే బడ్జెట్ తక్కువగా అయిందని శశికాంత్‌ వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus