షాకిస్తున్న అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ డిజిటల్ బిజినెస్ వివరాలు..!
September 18, 2020 / 05:05 PM IST
|Follow Us
‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నుండీ సినిమా వచ్చి రెండేళ్లు పైనే అవుతుంది. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కాసేపు ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కనిపించి అలరించింది అనుష్క. అయితే ఆమె ఫుల్ లెంగ్త్ రోల్లో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం కోసమే ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో అది వర్కౌట్ కాలేదు.
ఇక థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చెయ్యడానికి రెడీ అయిపోయారు నిర్మాతలు. అక్టోబర్ 2న ‘నిశ్శబ్దం’ ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ మరియు ‘కోన ఫిలిం కార్పొరేషన్’ బ్యానర్ల పై విశ్వప్రసాద్, కోన వెంకట్ లు కలిసి నిర్మించారు. ‘నిశ్శబ్దం’ ను నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వారికి 24కోట్లకు అమ్మారట.
ఈ చిత్రానికి వారు పెట్టిన బడ్జెట్ 30కోట్లని తెలుస్తుంది. ఇక శాటిలైట్ మరియు డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 15 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందట. దానికి సంబంధించిన డిస్కషన్లు కూడా జరుగుతున్నాయట. ఆ రేటు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని వినికిడి. ఒకవేళ 2నెలలు ముందుగానే ‘నిశ్శబ్దం’ ను అమెజాన్ ప్రైమ్ వారికి ఇచ్చినట్లయితే 30కోట్ల వరకూ అమెజాన్ వారు చెల్లించి ఉండేవారని కూడా తెలుస్తుంది.కానీ గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో ‘నిశ్శబ్దం’ టీం ముందడుగు వెయ్యలేకపోవడంతో ఇప్పుడు 24కోట్లకే ఫైనల్ చెయ్యాల్సి వచ్చిందట.