అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ‘యూ టర్న్’ హిందీ రైట్స్

  • June 29, 2018 / 01:40 PM IST

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత తొలి సారి చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ “యూ టర్న్”. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. ఇందులో లీడ్ రోల్ ని సమంత పోషిస్తోంది. జర్నలిస్ట్ గా కనిపించనుంది. ఇది సమంత కెరీర్ లోనే లో బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న మూవీ. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత సన్నివేశాలన్నిటినీ పూర్తి చేసింది. వచ్చే వారం నుండి ఆమె పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుంది. అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఆగష్టు చివరి వారంలో థియేటర్లోకి రానుంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల్లోనే కాదు హిందీలోనూ భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ హిందీ రైట్స్ కోసం 2.10 కోట్లు చెల్లించారని తెలిసింది. ఇది యువ హీరోల సినిమాకు ఇచ్చే మొత్తం కన్నా చాలా ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం సమంతే అని సమాచారం. వరుసగా ఆమె సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కురిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమాకూడా అత్యధిక కలక్షన్స్ వస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. తెలుగులోనూ భారీ ధరకు సొంతం చేసుకోవడానికి క్యూలో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus