మెగా హీరో అయినా… మొదటి సినిమాకి అంత బడ్జెట్ అవసరమా?
January 31, 2020 / 08:17 PM IST
|Follow Us
మెగా హీరోలు స్పీడ్ గురించి.. స్టార్ డం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చరణ్, బన్నీలు దూసుకుపోతున్నారు. మరో పక్క వరుణ్ తేజ్, సాయి తేజ్ వంటి హీరోలు కూడా మీడియం బడ్జెట్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి వారిని కాస్త పక్కన పెడితే.. మిగిలిన వారంతా మంచి ఫామ్లో ఉన్న హీరోలే..! ఇప్పుడు మరో హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వైష్ణవ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
‘మైత్రి మూవీ మేకర్స్’ , ‘సుక్కు రైటింగ్స్’ బ్యానేర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి బడ్జెట్.. అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోతుందని తాజా సమాచారం. విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరో విలన్ గా నటిస్తుండడం.. లొకేషన్లు, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం బడ్జెట్ 25కోట్లు దాటుతుందట. నిజానికి మెగా హీరోకి ఇది పెద్ద బడ్జెట్ ఏమీ కాదు. కానీ ఓ కొత్త హీరోకి ఇంత బడ్జెట్ పెట్టడం అంటే ఎక్కడో తేడా కొడుతుందేమో అనే భయం నిర్మాతల్లో ఉంది. 25 కోట్లకు మించే బడ్జెట్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. థియేట్రికల్ బిజినెస్ కచ్చితంగా అంత పెద్ద మొత్తంలో జరిగే అవకాశం లేదు.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా అంత జరిగే అవకాశం ఉంటుందా అనే అనుమానంగానే కనిపిస్తుంది. మరి ఈ మొత్తాన్ని ఎలా రాబట్టుకుంటారో నిర్మాతలు.