Prabhas 25: ప్రభాస్ 25.. అంతకుమించి అనేలా మరో హై బడ్జెట్?

  • October 7, 2021 / 09:48 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాలను వరుసగా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకు వచ్చిన ఘనత ప్రభాస్ దే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ డార్లింగ్ మాత్రం కొత్త ప్రాజెక్టులను తెరపైకి తీసుకు రావడంలో ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

అంతే కాకుండా రెస్ట్ లేకుండా కమిట్మెంట్ ప్రకారమే ఒళ్ళు వంచి వర్క్ చేస్తున్నాడు కూడా. ఒక సినిమా అయిపోగానే మళ్ళీ వెంటనే మరొక సినిమాతో బిజీ అవుతూ వస్తున్న ప్రభాస్ త్వరలోనే తన 25వ ప్రాజెక్టుపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల ఇండస్ట్రీలో ఒక టాక్ గట్టిగానే వచ్చింది. ముఖ్యంగా అక్టోబర్ 7వ తేదీన స్పెషల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ ప్రాజెక్టు ను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే అవకాశం ఉందట.

యూవీ క్రియేషన్స్ మరొక బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉన్నట్లు అయితే మరొక టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ అయితే ఇప్పటి వరకు ఏ సినిమాకు ఖర్చు చేయనంత గా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. దాదాపు ప్రభాస్ 25వ ప్రాజెక్టు కు 500కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందట. ఇక త్వరలోనే కొన్ని చర్చల అనంతరం ప్రభాస్ ఆ ప్రాజెక్టుకు పై సంతకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్టును ఎప్పుడు సెట్స్ పైకి తీసుకు వస్తారో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus