Vakeel Saab: ‘వకీల్ సాబ్’ ఇక మొత్తం స్లీపేసినట్టే..!
April 20, 2021 / 04:45 PM IST
|Follow Us
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ లభించింది. దాంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రం పై కక్ష సాధింపు చర్యలు చేపట్టినప్పటికీ భారీ ఓపెనింగ్స్ ను నమోదు కాకుండా ఆపలేకపోయింది. అటు తరువాత కూడా ఉగాది,అంబేద్కర్ జయంతి సెలవులు కూడా కలిసి రావడంతో బాగానే క్యాష్ చేసుకుంది.
అయితే ఆ తరువాత నుండీ మాత్రం పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ‘వకీల్ సాబ్’ సినిమాకి టికెట్ రేట్లు తగ్గించేసిన మాట వాస్తవమే. అయినప్పటికీ థియేటర్లలో రెండు వరుసల సీట్ల జనాలు కూడా ఉండడం లేదు. ఇప్పుడు కలెక్షన్లు చాలా వరకూ పడిపోయాయి. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోలైన చిరంజీవి, రాంచరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు ఇప్పటికే 100 కోట్ల షేర్ మూవీస్ ను సాధించారు.ఎన్టీఆర్ ఇంకా ఆ లిస్ట్ లో చేరలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఆ ఫీట్ ను సాధించే అవకాశం ఉంది.
అయితే ‘వకీల్ సాబ్’ తో పవన్ కళ్యాణ్ కూడా ఆ ఫీట్ ను సాధిస్తాడు అని ఆయన అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇప్పుడు 100 కోట్ల షేర్ మాట అటుంచితే.. ‘వకీల్ సాబ్’ బ్రేక్ ఈవెన్ అవ్వడమే కష్టంగా మారింది. ‘వకీల్ సాబ్’ హిట్ అనిపించుకోవాలి అంటే బాక్సాఫీస్ దగ్గర రూ.90.5 కోట్ల షేర్ ను వసూల్ చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ఇంకా రూ.85కోట్ల షేర్ కూడా వసూల్ కాలేదు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగానే ‘వకీల్ సాబ్’ కు ఘోరమైన దెబ్బ తగిలినట్టు స్పష్టమవుతుంది. కనీసం ఈ సినిమాని 2 వారాల ముందు రిలీజ్ చేసినట్టు అయితే.. కచ్చితంగా రూ.100 కోట్ల షేర్ ను అధిగమించి ఉండేది.