2020 సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ ల క్కుర్చీఫ్ లు వేసుకుని కూర్చున్నారు. వీటితో పాటు రజినీ కాంత్, మురుగదాస్ ల ‘దర్బార్’ కూడా సంక్రాంతికే రాబోతుంది. ఇక ఈ పెద్ద సినిమాలతో పాటు శర్వానంద్ ‘శ్రీకారం’ అనే సినిమా కూడా రాబోతుంది. శర్వానంద్ కు ‘శతమానం భవతి’ వంటి హిట్ ఉంది… ఎలగూ తన మార్కెట్ తనకుంటుంది అనుకోవచ్చు. కానీ కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుండడం విశేషం. ఇంతే అనుకుంటే… బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అలాగే సాయి తేజ్, మారుతీ ల ‘ప్రతీరోజూ పండగే’ సినిమాలు కూడా సంక్రాంతికే రాబోతున్నాయట.
మొత్తంగా చూసుకుంటే.. ఈ ఏడు సినిమాలు సంక్రాంతినే టార్గెట్ చేసాయి. సంక్రాంతి టార్గెట్ గానే షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే అందరికీ ఓ సందేహం కచ్చితంగా ఉంటుంది. అదే థియేటర్స్ ఎలా ఎడ్జస్ట్ చేస్తారా అని? అల్లు అర్జున్ సినిమాని ‘గీత ఆర్ట్స్’ అలాగే మహేష్ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దాదాపు థియేటర్స్ ను వాటికే కేటాయిస్తారు. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాకి ఎంతవరకూ పెర్మిషన్ ఇస్తారనేది కూడా ఓ అనుమానమే. ఈఏడాది అలా అనుకోకుండా ‘పేట’ సినిమా వచ్చింది. మంచి టాక్ వచ్చినా థియేటర్స్ లేకపోవడంతో ప్లాప్ గా మిగిలింది. ఇక బాలయ్య, సాయి తేజ్ సినిమాలకి కూడా థియేటర్లు బాగానే దొరికే అవకాశం ఉంది. కానీ కళ్యాణ్ రామ్, శర్వానంద్ ల సినిమాలకి మాత్రం థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం కచ్చితంగా ఉంది అనడంలో సందేహం లేదు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.