Pawan Kalyan: రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తున్న వీరమల్లు.. కానీ?

  • September 5, 2022 / 10:38 AM IST

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పవర్ గ్లాన్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.

నిర్మాత ఏఎం రత్నం ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల రేంజ్ లో ఈ సినిమాకు ఆఫర్లు వస్తుండటంతో నిర్మాత సైతం సంతోషిస్తున్నారని తెలుస్తోంది. 2023 సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని బోగట్టా. ఆ సమయానికి ఈ సినిమా రిలీజయ్యే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారని సమాచారం అందుతోంది.

200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా 300 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కెరీర్ లో ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న సినిమా హరిహర వీరమల్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఈ సినిమాలలో ఏ సినిమా మొదట మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ పెరుగుతుండగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus