Chiranjeevi: డైరెక్టర్ల ఎంపిక విషయంలో మెగాస్టార్ తప్పు చేస్తున్నారా?
July 13, 2022 / 05:23 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. రీఎంట్రీలో చిరంజీవి రీమేక్ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ఈ ఏడాది చిరంజీవి నటించి థియేటర్లలో విడుదలైన ఆచార్య సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదనే సంగతి తెలిసిందే. కొరటాల శివ సినీ కెరీర్ లో ఈ సినిమా తొలి డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
అయితే ఆచార్య సినిమా రిజల్ట్ వల్ల చిరంజీవి తర్వాత సినిమాల డైరెక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది దసరా కానుకగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ థియేటర్లలో విడుదల కానుంది. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. లూసిఫర్ సినిమా తెలుగులోకి డబ్ కావడంతో ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను చూసేశారు.
గాడ్ ఫాదర్ తో మోహన్ రాజా చిరంజీవి కోరుకున్న విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైనా ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు అయితే ఏర్పడలేదని చెప్పాలి. గాడ్ ఫాదర్ లో చిరంజీవి ఫ్యాన్స్ కోరుకునే కొన్ని అంశాలు ఉండవు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాల్సి ఉంది. 2023 సంక్రాంతి కానుకగా చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది.
బాబీ గత సినిమా వెంకీ మామ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు లేని బాబీ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. మెహర్ రమేష్ ఫ్లాప్ డైరెక్టర్ కావడంతో భోళా శంకర్ సినిమాను మెగా ఫ్యాన్స్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. స్టార్ డైరెక్టర్లకు చిరంజీవి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.