భారీ ధర పలికిన బహుబలి కంక్లూజన్ నెల్లూరు థియేటర్స్ హక్కులు
February 14, 2017 / 12:45 PM IST
|Follow Us
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అపూర్వ సృష్టి “బాహుబలి : బిగినింగ్” సినిమా 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను నెలకొల్పగా… ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఔరా అనిపించింది. నైజాం(తెలంగాణ) ఏరియా హక్కులు 50 కోట్లకు, సీడెడ్ (రాయల సీమ) థియేటర్ హక్కులు 27 కోట్లకు అమ్ముడు పోయి వార్తలో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం ఒక్క నెల్లూరు జిల్లా హక్కులు 5 .6 కోట్లు పలికి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఇప్పటివరకు ఏ మూవీ ఇంత ధర పలకలేదు. ఎందుకంటే అక్కడ స్టార్ హీరోల సినిమాలు సైతం 4 కోట్ల కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టలేదు.
చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 మూవీ కూడా 3 .30 కోట్లు రాబట్టింది. బాహుబలి బిగినింగ్ మాత్రమే 4 .5 కోట్లతో నెల్లూరులో అత్యధిక కలక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు బాహుబలి 2 హక్కులను 5 .6 కోట్లు చెల్లించి డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారు. నష్టం రాకుండా ఉండాలంటే పంపిణీదారులు 6 కోట్లు రావాల్సి ఉంటుంది. 5 కోట్ల సామర్థ్యం కలిగిన ఈ జిల్లాలో బాహుబలి కంక్లూజన్ 6 కోట్లకు పైగా కలక్షన్స్ తీసుకురాగలుగుతుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఫలితం ఎలా ఉండబోతోందో తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.