ఆకట్టుకుంటున్న “అదితి భావరాజు” డోంట్ బ్రేక్ మై హార్ట్’ సాంగ్!

  • November 26, 2021 / 06:14 PM IST

ప్రేమ.. ఎంత తియ్యగా, హాయిగా ఉంటుందో.. అదే దూరమైతే అంతే బాధను పరిచయం చేస్తుంది. మనసుకు దగ్గరైన వాళ్లు దూరమైతే ఆ బాధ ఎలా చెప్తాం? అసలు అది వర్ణనాతీతం. రోజా పువ్వు ఇచ్చి రోజూ ఐ లవ్ యూ చెప్పే జనరేషన్ కాకపోవచ్చు. ప్రేమ లేఖలు రాసే సమయం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమ కోల్పోతే పడే బాధ మాత్రం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ టూ సేమ్. ఆ బాధను కళ్లకు కట్టేలా.. చూసే ప్రతి వారికి వాళ్ల దూరమైన ప్రేమ గుర్తొచ్చేలా.. చూస్తున్నంత సేపు కంట నీరు జారేలా.. ఉన్న ఓ పాటను చూశాను.. కాదు మనసుతో విన్నాను. అదే ‘డోంట్ బ్రేక్ మై హార్ట్’ సాంగ్.

విన్నంత సేపు మనసును ఏదో పట్టి పిండేస్తున్నంత బాధగా ఉన్నా.. ఆ పాటలో ఏదో మాయ ఉంది. కాదు కాదు.. ఆ వాయిస్‌లోనే ఏదో మేజిక్ ఉంది. అదితి భావరాజు.. పాడిన విధానం గురించి వర్ణించేంత స్థాయి లేదు కానీ.. ఆ వాయిస్‌కు దాసోహం అని చెప్పేంత ఇష్టం అయితే ఉంది.గత మూడేళ్లలో ఆమె పాడిన పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ‘వెంకీమామ’ చిత్రంలో ‘కోకాకోలా పెప్సీ’,’ఏబిసిడి’ సినిమాలో ‘మెల్లమెల్లమెల్లగా’..  ‘పలాస’ సినిమాలో ‘బావొచ్చాడు’, విశాల్ ‘ఎనిమీ’ తమిళ్ చిత్రంలోని ‘టుమ్ టుమ్’ లాంటి సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా కెరీర్ కొనసాగిస్తూనే ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తోంది అదితి భావరాజు. నెప్ట్యూన్ మ్యూజిక్ ఎల్ఎల్పీ అనే మ్యూజిక్ లేబుల్ మీద వచ్చే ఏడాదిలో దాదాపు డజను పాటలు రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ‘డోంట్ బ్రేక్ మై హార్ట్’ సాంగ్ ఆమెని మరో మెట్టు ఎక్కించిందనే చెప్పాలి.

ఇక రాకేందు మౌళి అందించిన సాహిత్యం మనసు మరో లోకంలోకి తీసుకెళిపోతుంటే.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం కట్టిపడేసింది. ముఖ్యంగా మొత్తం పాట అమృతరస సాగరం అయితే అందులో ఈ రెండు లైన్లు జాలువారిని తేనె చినుకులు.

”శ్వాసల్లె చేరి అమావాస్యల్లె నువ్వు మారావా.. విడలేని మలుపుల్లో వీడుకోలైనకాలేవా..”

ఈ ఇండిపెండెంట్ సాంగ్ ఇంతలోనే ఇంత నచ్చేస్తుందనుకోలేదు. అన్నింటిని మించి అంత బాధల సంద్రంలో.. కష్టాల కన్నీళ్లల్లో ముంచేసి.. పాట చివరికి వచ్చేసరికి జీవితం ఎంత ముఖ్యమో చెప్పిన విధానం అదిరింది.

నిజమే జీవితంలో ఏమవుతుందో ఊహించలేం. కానీ జరిగిన దానిని అంగీకరించాలి. రేపటి స్వప్నం కోసం మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాలి. ఇంత చక్కని మెసేజ్‌ను 4 నిమిషాల పాటలో అందించిన బృందానికి హ్యాట్సాఫ్.

ఇలాంటి పాటలు మరిన్ని మీ దగ్గరకు రావాలని.. మా మనసు దోచుకోవాలని.. మీరు మరింత ఎదగాలని.. ఎంత ఎదిగినా ఇలానే ఒదిగి ఉండాలని.. మనసారా కోరుకుంటున్నాం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus