సప్తగిరి సినిమాకి అంత అవసరమా?

  • September 16, 2017 / 04:22 PM IST

కెమెడియన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న సప్తగిరి కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన “సప్తగిరి ఎక్స్ ప్రెస్” గతేడాది విడుదలై ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు.. నిర్మాతలకు ఓ మోస్తరు లాభాలు సైతం తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని అదే నిర్మాత మళ్ళీ “సప్తగిరి ఎల్.ఎల్.బి” అనే సినిమాను మొదలెట్టారు. హిందీలో ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు.. నేషనల్ అవార్డ్ సైతం సొంతం చేసుకొన్న “జాలీ ఎల్.ఎల్.బి”కి రీమేక్ ఇది.

ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టి.. రెండు షెడ్యూల్స్ పూర్తయిన ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకొని “సప్తగిరి ఎల్.ఎల్.బి” సినిమా కోసం ఇప్పటికే దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. సప్తగిరిని నమ్ముకొని అన్ని కోట్లు ఎలా ఖర్చు చేశాడో నిర్మాతకే తెలియాలి. మరి వాళ్ళు పెట్టిన డబ్బులకు లాభం అటుంచి రిటర్న్స్ ఏమాత్రం వస్తాయో తెలియాలంటే విడుదలవరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus