తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న సైరా నరసింహారెడ్డి సినిమా పనులు ఊపందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గుర్రపు స్వారీ, కత్తి విన్యాసాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. డైరక్టర్ సురేందర్ రెడ్డి లొకేషన్ల సెలక్షన్ లో బిజీగా ఉన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాత్రం 1840 ల నాటి వాతావరణాన్ని సృష్టించేందుకు కష్టపడుతున్నారు. ఆర్టిస్టులతో స్కెచ్ లు గీయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “200 ఏళ్ళ క్రితం నాటి పరిస్థితులకు సంబందించిన ఆధారాలు ఏవీ లేవు. అందుకే అందుబాటులో ఉన్న పుస్తకాలు, వీడియోలో అన్నీ పరిశీలిస్తున్నాం.
స్వాతంత్ర్యానికి ముందు జనజీవితం ఎలా ఉండేదో స్క్రీన్ మీద అలానే చూపించాలని ప్రయత్నిస్తున్నాం. 15 మంది టీమ్ స్కెచెస్ రెడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్, రాజస్థాన్, పొల్లాచి వంటి ప్రాంతాల్లో సెట్టింగ్స్ వేయనున్నాం” అని వివరించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.