బిగ్‌బాస్ 4: ఉక్కు హృదయం టాస్క్‌లో ఏం జరిగిందంటే?
September 23, 2020 / 11:19 AM IST
|Follow Us
రెండు వారాలు కూల్‌గా సాగిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో హీట్ పుట్టించడానికి, పోటీ తత్వం పెంచడానికి బిగ్‌బాస్ ఉక్కు హృదయం పేరుతో టాస్క్ ఇచ్చాడు. పైగా దానికి కెప్టెన్సీ పోటీదారులు నిర్ణయించే టాస్క్ అని కూడా చెప్పాడు. అంత స్పెషల్ టాస్క్‌లో ఏం జరిగిందంటే?
* ఉక్కు హృదయం పేరుతో బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. దాని ప్రకారం రోబోలు, మనుషులుగా రెండు టీమ్‌లు విభజించాడు. రోబోల టీమ్‌లో అందరూ చనిపోతే మనుషులు విజేతలు అవుతారు. అలా కాకుండా ఒక్క రోబో మిగిలి ఉన్నా రోబోలు విజేతలు అవుతారు. ఇందులో గెలిచిన టీమ్ మాత్రమే కెప్టెన్సీ పోటీదారులు అవుతారు.
* మనుషులు గార్డెన్ ఏరియాలో ఉంటారు. ఇంట్లో ఉన్న గ్యాస్, వాటర్‌తోపాటు ఇంట్లో ఎక్కడికి వెళ్లాలన్నా రోబోల నియంత్రణలో ఉంటుంది. రోబోట్స్‌కి సమయానుసారం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఆ అవకాశం కేవలం మనుషులకు మాత్రమే ఉంది. రోబోలను ఛార్జ్ చేసినప్పడు మనుషులు గ్యాస్, వాటర్ యాక్సెస్ పొందొచ్చు.
* ఒక రోబో ప్రాణానికి గుర్తుగా సిల్వర్ బాల్ పెట్టారు. ఆ బాల్‌ను పగలకొడితే ఒక రోబో చనిపోతుంది. అయితే బాల్ పగలకొట్టేముందు ఏ రోబో గురించో చెప్పాలి. అందుకే రోబోలు ఆ బాల్‌ను పగల కొట్టడానికి ప్రయత్నించొచ్చు. అలా బాల్ పగలకొట్టి దేవి అనే రోబోను చంపేశారు.
* మొత్తం టాస్క్‌లో హీట్ పుట్టించే పనులు చాలా జరిగాయి. ఆరియాను సుజాత మనుషులు డగౌట్‌గా పెట్టుకున్న స్మోక్ ఏరియా నుంచి లాగి పడేసింది. మరోవైపు మెహబూబ్ చొక్కా పట్టుకొని లాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిల్వర్ బాల్ ప్లేస్ మార్చేయడంతో లాగుడు పీకుడు జరిగింది. రగ్బీ గేమ్ స్టైల్లో పడిపోయి మరీ కొట్టుకున్నారు. ఫిజికల్ టాస్క్ వచ్చేటప్పటికీ మెహబూబబ్ యాక్టివ్ అయిపోయాడు. వరుసగా బాల్ మీద దాడి చేయాలని చూశాడు. కెమెరాలను కవర్ చేసినందుకుగాను మనుషుల టీమ్‌కు బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు.
* ఫన్నీ మూమెంట్స్ విషయానికొస్తే… సోహైల్‌ను ఏడిపించుకుంటూ అద్దానికి అటువైపు ఉండి హారిక తినడం సూపర్ క్యూట్‌గా కనిపించింది. రోబోల బ్యాటరీ పాయింట్ తగ్గినప్పుడల్లా మనుషుల టీమ్, మనుషుల టీమ్ అవసరమైన వస్తువులు ఇవ్వకుండా రోబోల టీమ్ చేసిన డ్యాన్స్ బాగుంది. ఈ క్రమంలోనే అవినాష్ బర్త్ డే వేడుకను హౌస్మేట్స్ నిర్వహించారు.