ప్రముఖ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శివాజీని అరెస్ట్ చేసారు. అలంద మీడియా కేసులో శివాజీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆ కేసులో ఇప్పటికే టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాష్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. అలంద మీడియా సెక్రటరీ అయిన కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్టు ఆయన కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు నిధుల్ని కూడా దుర్వినియోగం చేసారని అలంద మీడియా సంస్థ ఆరోపించింది కూడా. అలంద మీడియా సంస్థ ఇలా కంప్లైంట్ ఇవ్వడంతో సైబర్ క్రైం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రవిప్రకాష్‌తో పాటు హీరో శివాజీ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నట్టు పోలీసులు చెప్పుకొస్తున్నారు.
దీంతో శివాజీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉండగా వెంటనే పోలీసులు వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా శివాజీ పోలీసులకి కనబడకుండా తప్పించుకుని తిరుగుతున్నారంట. దేశం వదిలి పారిపోవాలని ప్రయత్నిస్తుండగా ఇలా అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మరి ఆయన్ని విచారించి వదిలేస్తారా.. లేక కోర్టులో ప్రవేశపెడతారావు అనేది చూడాల్సి ఉంది.