రోజురోజుకూ పెరుగుతున్న మూతబడుతున్న సినిమా థియేటర్ల లిస్ట్!

  • November 25, 2020 / 06:41 PM IST

సినిమా అనేది ఒక సంబరం. ఈ సంబరాన్ని మనస్ఫూర్తిగా జరుపుకొనే ఓ గొప్ప వేదిక థియేటర్. ఎన్ని ఓటీటీలు, ఏటీటీలు వచ్చినా.. సినిమా థియేటర్ కి ఉండే క్రేజ్ వేరు. తమకు ఇష్టమైన హీరో ఎంట్రీ సీన్ కి థియేటర్ లో పేపర్లు ఎగరేసి, కాలర్ తిప్పి, మనసారా అరిచి గోల చేసి చూడడంలో ఉండే మజా వేరు. మల్టీప్లెక్స్ వ్యవస్థలోనూ ఈ సంబరాల హవా తగ్గలేదు. అయితే.. కరోనా మాత్రం పెద్ద దెబ్బ వేసింది. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూసేయడంతో.. సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ బాటపట్టాయి.

హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని సినిమా తక్కువ ఖర్చుతో కుటుంబం మొత్తం ఆస్వాదిస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. అయితే.. ఈ ఎఫెక్ట్ గట్టిగా పడింది మాత్రం థియేటర్ యాజమాన్యాల మీదే. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వంటివారు సైలెంట్ గా ఉండిపోగా.. థియేటర్ యజమానులు మాత్రం భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అయితే.. ఇటీవల కేసీఆర్ థియేటర్లపై వరాల జల్లు కురిపించినా.. అది పెద్దగా ఉపయోగపడుతుంది అనిపించడం లేదు. ఎందుకంటే.. కొన్ని లక్షల మంది ప్రేక్షకులు సినిమాలు చేసి ఆనందించిన థియేటర్లు మూతపడుతుండడమే అందుకు కారణం.

మెహదీపట్నంలోని “అంబా”, టోలీచౌకీలోని గ్యాలక్సీ థియేటర్, నారాయణగూడ శాంతి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ శ్రీమయూరి, బహదూర్ పురాలోని శ్రీరామ థియేటర్లు గోడౌన్ లేదా షాపింగ్ మాల్స్ గా మారుతుండడం. మల్టీప్లెక్స్ వ్యవస్థ కారణంగానే కాస్త దెబ్బ పడినప్పటికీ.. లోకల్ ఆడియన్స్ ప్రోత్సాహంతో ఇప్పటివరకు బాగానే నడిచాయి ఈ థియేటర్స్. కానీ.. కరోనా దెబ్బతో మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. మరిన్ని థియేటర్లు గోడౌన్ లగానో, ఫంక్షన్ హాల్స్ లేదా షాపింగ్ మాల్స్ గానో మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికైనా బడా నిర్మాతలు కాస్త దయ తలిచి.. తమ కబంధ హస్తాల్లో అల్లాడుతున్న థియేటర్ వ్యవస్థను కాపాడుకోవాలి. లేదంటే మరో 20 ఎల్లా తర్వాత సింగిల్ స్క్రీన్స్ ఉండేవి అని చెప్పుకొనే పరిస్థితి ఏర్పడుతుంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus