హైపర్ ఆది.. తెలుగు టీవీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న స్టార్ కమెడియన్. సినిమాల్లో ఈ మధ్యే తన దూకుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. రైటర్‌గాను, నటుడిగాను సినిమాల్లో పని చేస్తున్న హైపర్ ఆది ఇటీవల ‘సార్’ సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ సినిమాలోని మెయిన్ థీమ్ అయిన టీచర్ల గురించి ఆది మాట్లాడారు. ఈ క్రమంలోనే వైరల్ కామెంట్స్ చేశారు. అయితే అవన్నీ ఆయన వ్యక్తిగతం కావడం గమనార్హం.
చదువు గొప్పతనం, విద్యా వ్యవస్థ గొప్పతనం గురించి చెప్పేలా వెంకీ అట్లూరి ‘సార్’ సినిమాతో ప్రయత్నం చేశారని ఆది కొనియాడాడు. ఆ తర్వాత సినిమా చూశాక తాను చేసిన పని గురించి చెప్పాడు. ‘సార్’ సినిమా చూశాక మా సుబ్రహ్మణ్యం మాస్టారుకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పాను’’ అని హైపర్ ఆది తెలిపారు. అంతేకాదు ఆ తర్వాత ఆ మాస్టారు చెప్పిన మాటల్ని కూడా వివరించారు. నేను ఫోన్ చేసి మాస్టార్‌కి సారీ చెప్పాను.
అంతే కాదు గతంలో తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాను. అలా ఆ రోజుల్లో నేనేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని మాస్టార్‌కి ఫోన్ చేసి అడిగాను. అయితే ఆయన ఆ మాటలు విని ‘‘అప్పుడే కాదురా ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఈ టైంలోనంట్రా కాల్ చేసేది’’ అని అన్నారు అని హైపర్ ఆది సరదాగా మాట్లాడారు. నిజానికి ఆది చెప్పింది కూడా నిజమే.
‘సార్’ సినిమా చూశాక చదువుకునే రోజుల్లో వ్యవహరించిన తీరు ఆ తర్వాత పెద్దవాళ్లు అయిపోయాక గుర్తుకు చేసుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే కొంతమంది ‘సార్’ సినిమా చూశాక వాళ్ల స్కూలు రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారట. అందరికీ ఆదికి జరిగినట్లు జరగాలని లేదు కానీ.. ఇంచుమించు ఇలానే జరిగి ఉండొచ్చు అంటున్నారు. మీరు కూడా సినిమా చూసి ఉంటే మీకేం అనిపించింది?
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?