Hyper Aadi: రాజకీయాల్లో పవన్ పేరు శాశ్వతం: హైపర్ ఆది గూస్బంప్స్ కామెంట్స్.!
June 24, 2024 / 08:50 PM IST
|Follow Us
ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజయోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చినవాళ్లు కూటమి అఖండ విజయాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో కమెడియన్, జన సైనికుడు హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉన్నాం. నా పేరు హైపర్ ఆది (Hyper Aadi) .. నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగారి తాలూకా అంటూ ఆది తన ప్రసంగాన్ని హైలో స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని మేం ఎన్నేళ్లయినా చెప్పుకుంటాం. అంత కష్టపడ్డాం.. అలా వచ్చన ఫలితం కూడా అంతే ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పాడు ఆది. కూటమి అనే సినిమా 164 రోజులు ఆడటం వల్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక కొడుకు తన మొదటి సంపాదనతో చీర కొనిచ్చినప్పుడు తల్లి ముఖంలో ఎంత ఆనందం కనిపిస్తుందో..
అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద కూర్చుండబెట్టినప్పుడు తండ్రి కళ్లల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఎన్నికల్లో గెలిచినప్పుడు అభిమానుల కళ్లల్లో, జన సైనికుల కళ్లలో అంతటి ఆనందం కనిపించింది అని ఆది వివరించాడు. పవన్ కల్యాణ్‌ని తన అభిమానులు ‘సీఎం సీఎం’ అని అంటుంటే.. కొంతమంది ‘ముందు మీవాడిని ఎమ్మెల్యే అవ్వమను’ అని అనేవారు. అలాంటోళ్లు ఇప్పుడు చూడండి.. ‘21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలను పవన్ గెలిపించుకున్నాడు, గెలిచాడు కూడా.
రాజకీయం అనేది బతికి ఉన్నంత కాలం పవన్ కల్యాణ్ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి విజయాన్ని మీరు చూశారు. పదో తరగతి సోషల్ టెక్స్ట్ బుక్‌లో రాజుల చరిత్ర గురించి చదివే ఉంటారు. అలాంటి పుస్తకంలో పవన్ కల్యాణ్ గురించి కూడా రాయాలి. ఆయన చరిత్రలో త్యాగాలు, సహాయాలు ఉంటాయి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిచాక గర్వం ఉంటుంది. కానీ పవన్‌లో భయం చూశాను. ఎందుకంటే ప్రజలు తనను ఎన్నుకొని బాధ్యత అప్పగించారు.
ఆ బాధ్యతల్ని నిర్వర్తించాలనే భయం ఆయనది. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం అదృష్టవంతులుగా భావించాలి. లంకా దహనం చేసిన హనుమంతుడు వెళ్లి రాముడి పాదాలు పట్టుకున్నట్లు.. 21 సీట్లు గెలుచుకున్నాక పవన్ వెళ్లి తన అన్న కాళ్ల మీద పడ్డాడు. మెగా ఫ్యామిలీకి పవన్ దూరంగా ఉంటాడు అని కొందరు అంటుంటారు. కానీ తన విజయాన్ని తీసుకెళ్లి అన్న కాళ్ల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆయనేంటో, ఆ కుటుంబం బంధమేంటో తెలిసింది అని హైపర్ ఆది అన్నాడు.