జబర్ధస్త్ కు ‘ఆది’ గుడ్ బై ?

  • May 13, 2017 / 10:12 AM IST

ప్రముఖ ఛానెల్ వారు ప్రసారం చేస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో చాలా మంది కమెడియన్లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వారి తర్వాత వచ్చిన వారికి కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి చాన్సులు వస్తున్నాయి. అంతేకాదు టాలెంట్ ను గుర్తించి ఎందరికో అవకాశం ఇచ్చి వారికి వారే ఎదిగేలా చేసిన ప్రోగ్రామ్ జబర్దస్త్. ఇదిలా ఉంటే ఇక జబర్ధస్త్  ప్రోగ్రామ్ తో పరిచయం అయిన హైపర్ ఆది ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాడు.  మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి ఆడియన్స్ ఎంతో ఇష్టపడుతున్నారు. ఆ ప్రోగ్రాంలో మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఆది దగ్గరకు వస్తే మాత్రం అదిరిపోవాల్సిందే. అంతేకాదు ఎక్కువశాతం మంది ఆది స్కిట్ చూడడం కోసమే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారట. మరి అలాంటి హైపర్ ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడనే రూమర్లు వినిపిస్తున్నాయి. అసలు ఏమయ్యింది? ఆది ఎందుకు బయటకు వచ్చేస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే, ఆది వచ్చిన కొత్తలో లేడీ గెటప్ వేశాడు. కానీ తాను లీడగా ఎదిగిన తర్వాత ఆడవేశం వేసే అవసరం రాకుండా చూస్తూ వచ్చాడు.

కామెడీ పై మంచి పట్టు ఉన్న ఆది తనను తాను ఫ్రూవ్ చేసుకొని తక్కువ వ్యవధిలోనే టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. కామెడీ పండించడాన్ని ఎంతో ఇష్టపడే ఆది జబర్దస్త్‌ను వదిలిపెట్టడానికి కారణాలేంటి అంటే? సాధారణంగా స్కిట్ ని బట్టి కొన్ని సార్లు జబర్దస్త్ షో నిర్వాహాకులు అవసరాన్ని బట్టి మీరు కూడా ఆడ వేషం వేయాల్సి వస్తుందని ఆదికి చెప్పారట. అది నచ్చని ఆది, అవసరమైతే షో నుంచి బయటకు వెళ్తాను గానీ, ఆడ వేషం మాత్రం వేయనని చెప్పాడట. దాంతో షో నిర్వాహకులకు, ఆదికి మద్య భేదాభిప్రాయలు వచ్చినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో..అబద్దమో కానీ  ఆది బయటకు వెళ్తే మాత్రం మంచి కమెడియన్‌ను జబర్దస్త్ షో మిస్సయినట్లే అంతేకాదు ఒకరకంగా ఈ ప్రోగ్రామ్ టీఆర్‌పీ పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూద్దాం మరి ఈ మ్యాటర్ ఎలా ఎండ్ అవుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus