మాస్కో ఫెస్టివల్ ల్లో బాహుబలి 2 ప్రదర్శించడంపై రాజమౌళి
June 22, 2017 / 07:32 AM IST
|Follow Us
బాహుబలి కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా 1076 స్క్రీన్లలో అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుంది. 1,708 కోట్లను వసూలు చేసింది. వీటన్నింటి కంటే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి మరో అంశం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. అది ఏమిటంటే… ఈరోజు ( 22 ) నుంచి 29 వరకు రష్యాలో మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో బాహుబలి కంక్లూజన్ ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ సినీ దర్శకులు, టెక్నీషియన్లు ఈ ఫెస్టివల్ కి అతిధులుగా రాబోతున్నారు. వారికీ బాహుబలి – ది కంక్లూజన్ చిత్రాన్ని ప్రత్యేకంగా చూపించబోతున్నారు. తాజగా ఈ విషయంపై రాజమౌళి ట్వీట్ చేసారు.
“మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గురించి చాల ఆసక్తిగా ఉన్నాను. ఇక్కడ ఓపెనింగ్ ఫిలిం గా బాహుబలి 2 ని ప్రదర్శిస్తుండడంతో చాలా గర్వంగా ఫీలవుతున్నాను.” అని ట్వీట్ చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఏ తెలుగు సినిమాకి దక్కని గౌరవం బాహుబలికి దక్కుతుంటే.. రాజమౌళి, చిత్రానికి పని చేసిన వారు మాత్రమే కాదు భారతీయులు ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీలవుతారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.