“స్పైడర్” తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ తెలుగులో కనిపించకపోయేసరికి అందరూ ఆమె కెరీర్ అయిపోయింది అనుకొన్నారు. కానీ.. ఆమె తమిళ, హిందీ సినిమాలతో యమ బిజీగా ఉంటోందనే విషయం ఇప్పుడిప్పుడే జనాలు అర్ధం చేసుకొంటున్నారు. తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఒక సినిమాతో నిన్నమొన్నటివరకూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆ నాలుగు సినిమాల షూటింగులు ఇంచుమించుగా ఒకేసారి మొదలవ్వడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో సూర్య, కార్తీల సరసన సినిమాల్లో నటిస్తూనే..శివకార్తికేయన్ తో మరో సినిమా సైన్ చేసింది రకుల్. ఈ మూడు సినిమాలతోపాటు హిందీలో అజయ్ దేవగన్ సరసన మరో సినిమాలో నటిస్తూ నిన్నటివరకూ లండన్ లో యమ బిజీ షెడ్యూల్ గడిపింది.
ఆ సినిమాల చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో అమ్మడు ఇప్పుడు తెలుగు మీద కూడా కాన్సన్ ట్రేట్ చేయడం మొదలెట్టింది. అయితే.. తెలుగు సినిమాలు సైన్ చేయడానికంటే ముందు కొంతకాలం బ్రేక్ తీసుకొంటాను అంటోంది. ఆల్రెడీ చాలా అలిసిపోయానని చెబుతున్న రకుల్ ఒక రెండు నెలలపాటు తన ఫ్యామిలీ మెంబర్స్ తో టైమ్ స్పెండ్ చేయనుంది. ఆ తర్వాత తెలుగులో మళ్ళీ వరుస సినిమాలు సైన్ చేయనుంది.