ఇలాంటి జోనర్ కథ చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు!

  • November 9, 2018 / 02:20 PM IST

అప్పట్లో త్రివిక్రమ్ ఏదో సినిమా కథ చెబుతుంటే పవన్ కళ్యాణ్ వింటూ వింటూ నిద్రపోయాడట. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా “అత్తారింటికి దారేది” ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రమైన “టాక్సీవాలా” కథను దర్శకుడు రాహుల్ చెబుతున్నప్పుడు కూడా అదే తరహా సంఘటన జరిగిందట. యువీ క్రియేషన్స్ ఆఫీస్ లో విజయ్ దేవరకొండకి రాహుల్ కథ చెబుతున్న తరుణంలో జోనర్ అండ్ పాయింట్ విని పారిపోవాలనుకొన్నాడట. కానీ.. రాహుల్ బలవంతంగా కూర్చోబెట్టి మరీ వినిపించాడట. పాయింట్ తోపాటు స్క్రీన్ ప్లే కూడా నచ్చడంతో ఒప్పుకొన్నాడట. రేపు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా ఘనంగా జరగనుంది.

అసలే.. “నోటా” డిజాస్టర్ అవ్వడంతో విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరీ “టాక్సీవాలా”ను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రొజెక్ట్ కూడా విజయ్ కి “గీత గోవిందం” లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బ్యానర్ నుంచి రానుండడంతో ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకొంటుందా లేదా అనేది అక్టోబర్ 17న తెలిసిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus