ఆమె కోసం సూసైడ్ చేసుకుందాం అనుకున్నా : విక్రమ్ భట్
May 1, 2017 / 12:37 PM IST
|Follow Us
హీరోయిన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని పిచ్చిగా అభిమానించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలి అంటే వారిని హద్దులు దాటి ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం ఏకంగా ఒక హీరోయిన్ కోసం చచ్చిపోవాలి అని అనుకున్నాడట, ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు, ఏమా కధ అంటే ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది…బాలీవుడ్ లో కొన్ని ఏళ్ల పాటి కుర్రకారుని కిర్రెక్కించిన మాజీ విశ్వసుందరి, పొడవు కాళ్ల సుందరి సుస్మితా సేన్ గుర్తు ఉందా, దాదాపుగా 45 ఏళ్ల వయసులోనూ వేడిపుట్టించే అందంతో కుర్రకారును సైతం మతిపోయేలా చేస్తోంది ఈ సెక్సీ బ్యూటీ. ఇక మన తెలుగులో నాగార్జున తో రక్షకుడు అనే సినిమా సైతం చేసి తన వేడి వేడి అందాలతో మన తెలుగువాళ్ళకు సైతం వేడి పుట్టించింది ఏ అమ్మడు. ఇక ఆమెతో అఫేర్స్ పెట్టుకోవాలని, ఎంజాయ్ చెయ్యాలి అని చాలా మంది చాలానే ట్రై చేశారు.
అదే క్రమంలో ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ అయితే ఆమె కోసం ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. సుస్మిత బాలీవుడ్లో అగ్రతారగా రాణిస్తున్న రోజుల్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయాలన్నీ విక్రమ్ రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విక్రమ్ తన భార్యతో విడిపోయాక సుస్మితతో ప్రేమలో పడ్డాడు. సుస్మిత కూడా అతణ్ని ప్రేమించింది. అయితే, తర్వాత ఆమెతో బ్రేకప్ అయ్యింది. దాంతో ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అలా కట్టుకున్న భార్యను కాదని, ప్రేమించిన ప్రియురాలు ఇతన్ని కాదని, మొత్తంగా ఏకాకి అయిపోయాడు ఈ దర్శకుడు…పాపం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.