ప్రముఖ నటి, బిగ్ బాస్ నటి యాషిక ఆనంద్ గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు పావని అక్కడికక్కడే మృతిచెందారు. యాషికకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని యాషిక ఇటీవల కోలుకున్నారు. అయితే తాజాగా యాషిక తన స్నేహితురాలకు సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవించి ఉన్నంతకాలం గిల్టీ ఫీలింగ్ తోనే ఉంటానని..
ఆ విషాదం నుండి తనను కాపాడిన దేవుడికి థాంక్స్ చెప్పాలో.. లేక ప్రాణ స్నేహితురాలిని దూరం చేసినందుకు నిందించాలో అర్ధం కావడం లేదని అన్నారు. ప్రతి క్షణం పావనిని మిస్ అవుతున్నానని.. ఆమె ఎప్పటికీ తనను క్షమించదని తెలుసని.. కానీ నన్ను క్షమించు పావని అంటూ ఎమోషనల్ అయింది. ఏదొక రోజు పావని కుటుంబం తనను క్షమిస్తుందని ఆశిస్తున్నట్లు.. ఆమెతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని యాషిక బోవోద్వేగంతో రాశారు.
బుధవారం యాషిక ఆనంద్ పుట్టినరోజు. అయితే తను పుట్టినరోజు వేడుకలు జరుపుకోనని.. దయచేసి బర్త్ డే వేడుకలు నిర్వహిచొద్దని ఫ్యాన్స్ ను కోరారు.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!