ప్రభాస్ తో సెల్ఫీ తీసుకోవాలని ఉంది : అమీరా దస్తూర్

  • September 1, 2018 / 01:27 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా అమ్మాయిలకు డార్లింగ్ అంటే ప్రాణం. బాహుబలి తర్వాత భాషాబేధం లేకుండా ప్రభాస్ ని ప్రేమిస్తున్నారు. సాధారణ అమ్మాయిలు మాత్రమే కాదు హీరోయిన్స్ సైతం అతనితో సెల్ఫీ దిగాలని కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని బాలీవుడ్ నటి అమీరా దస్తూర్ స్వయంగా చెప్పింది. కృష్ణ తనయురాలు మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. రాజు గాడు సినిమాలోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.

ఈరోజు ఆమె హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ మాల్‌లో స్విమ్ వేర్ బ్రాండెడ్ స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం అమీరా దస్తూర్ మాట్లాడుతూ “గతంలో నేను రెండు తెలుగు సినిమాలు చేసాను. ఇప్పటికీ ఇక్కడ అవకాశమొస్తే తప్పకుండా చేస్తాను. నాకు తెలుగు హీరోల్లో ప్రభాస్ అంటే చచ్చేంత ఇష్టం. నేను సెల్ఫీ తీసుకోవాలని కోరుకునే నటులలో ప్రభాస్ ముందుంటారు” అని చెప్పుకొచ్చింది. ఇలా ప్రభాస్ ని ఇష్టపడే బాలీవుడ్ సెలబ్రిటీల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. అతను ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరింత మంది అభిమానులను ప్రభాస్ ఏర్పరుచుకుంటారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus