మీమ్స్, మీమ్ వీడియోస్‌లో ఎప్పుడూ సెటైర్సే కాదు.. అప్పుడప్పుడూ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంటుంది. సమాజంలో జరిగే అన్యాయలో, సమాజానికి అవసరమైన విషయాలో చెబుతుంటారు. అలా ఇప్పుడు ఓ మీమ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యాక్సిన్ వేసుకోండి… అని అందరూ చెబుతున్నారు కదా. ఆ వీడియోలో కూడా అదే చెప్పారు. అయితే పూరి జగన్నాథ్ స్టయిల్లో. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ‘దేశముదురు’ డిక్షన్లో. ఏంటా వీడియో అనుకుంటున్నారా. అయితే కింద వీడియో చూసేయండి… తర్వాత డిస్కస్ చేద్దాం!
ఓకే వీడియో చూసేశారా.. ఎలా ఉంది. ఎడిటింగ్ అదిరిపోయింది. వాయిస్ కూడా సూట్ అయ్యింది. ఇదంతా పక్కన పెట్టేద్దాం. మరి వ్యాక్సిన్ గురించి ఏం ఆలోచించారు. మీ టర్న్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి మరి. శాస్త్రవేత్తలు చాలా రోజులుగా చెబుతున్నమాటే ఇది. ఎవరో ఔత్సాహికుడు వ్యాక్సిన్ వేసుకోండి అంటూ అవేర్నెస్ తీసుకురావడానికీ ఈ వీడియోను వాడుకున్నాడు. అయితే సందేశం ఎంత బాగుందో, దానిని చెప్పిన విధానం, రాసిన స్టయిల్ కూడా అంతే బాగున్నాయి. అందుకే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఈ వీడియోలో కరోనా వ్యాక్సిన్‌తోపాటు, కరోనా కష్టాలు, నియమాలు, చేయాల్సిన పనులు గురించి కూడా వివరించారు. రౌడీలు వచ్చిన కొట్టబోతుంటే సోషల్ డిస్టెన్స్ అని అనడం, హీరోయిన్ ఏడుపు, పరిగెత్తుకుంటూ వెళ్లిపోవడం లాంటి వాటిని వ్యాక్సిన్ భయాలు చెప్పేలా మార్చుకున్నాడు ఎడిట్ చేసిన ఔత్సాహికుడు. ఈ వీడియోను చూసి నవ్వుకోవడమే కాకుండా, మీరు వ్యాక్సిన్ వేయించుకోండి, మీ వారికి వేయించండి మరి.. దొరికినప్పుడు.