Ileana: కెరీర్‌ విషయంలో ఇలియానా నిర్ణయం తీసేసుకుందా?

  • September 12, 2022 / 12:41 PM IST

సినిమా మంచి ఊపు మీదున్న సమయంలోనే ఓటీటీలకు వెళ్తున్నారు మన నాయకానాయికలు. సౌత్‌లోనూ ఈ మధ్య ఈ స్టైల్‌ ఎక్కువైంది. చాలామంది ఫేడ్‌ అవుట్‌ అయిన కథానాయికలు ఓటీటీలవైపు వెళ్లిపోతున్నారు. స్టార్‌ నాయికలు కూడా ఇలాంటి పనిలో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఫేడ్‌ అవుట్‌ బ్యాచ్‌ నుండి మరో నాయిక ఓటీటీల్లోకి వెళ్లిపోతోంది అని టాక్‌. కుర్రకారును తన ఫిగర్‌తో కిర్రెక్కించిన ఇలియానేనే లెటెస్ట్‌ ఓటీటీ ఎంట్రీ. ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా.

ఆ వెంటనే మహేష్‌ బాబుతో ‘పోకిరి’ ఛాన్స్‌ కొట్టేసింది. ఏంటీ అమ్మడి స్పీడు అని అనుకున్నారు ఆ రోజుల్లో ఆ తర్వాత ఇలియానా జాతకమే మారిపోయింది. వరుసగా అగ్రహీరోలందరి సరసన నటించే ఛాన్స్‌ సంపాదించింది. సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్‌ ప్రయత్నాలు చేసి, అటు వెళ్లిపోయింది. దీంతో టాలీవుడ్‌కి దూరమైపోయింది. మళ్లీ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో ప్రయత్నం చేసినా సక్సెస్‌ కాలేదు. అలా అని బాలీవుడ్‌లో ఏమైనా పరిస్థితి బాగుందా అంటే లేదనే చెప్పాలి.

ఈంతో ఓటీటీలోకి వచ్చేయాలని ఇలియానా అనుకుంటోందట. ‘ది ఫేమ్ గేమ్’ తీసిన కరిష్మా కోహ్లి దర్శకత్వంలో ఇలియానా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోందట. అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్‌ , బిబిసి స్టూడియోస్ ఈ సిరీస్‌ను నిర్మిస్తాయట. మామూలుగా అయితే యువ నాయికలు, ఫేమ్‌లో ఉన్నవాళ్లు ఓటీటీకి వెళ్తే వెనక్కి వచ్చేసే అవకాశం ఉంది. కానీ సరైన అవకాశాలు లేని ఇలియానా మళ్లీ సినిమాల్లోకి వస్తుందా అనేది చూడాలి.

ఇక ఇలియానా సినిమాల సంగతి చూస్తే.. గతేడాది ‘బిగ్‌ బుల్‌’తో వచ్చింది. ఈ ఏడాది ఆమె చేతిలో ‘అన్‌ఫెయిన్‌ అండ్‌ లవ్లీ’తోపాటు శిరీషా గుహ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలు విజయం సాధిస్తే ఆమె ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే కష్టమే అంటున్నారు. అయితే ఇటీవల ఇలియానా ప్రేమ వ్యవహారంతోనే ఎక్కువగా మీడియాలో కనిపిస్తోంది. కట్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉందని సమాచారం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus