నెటిజన్లకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన గోవా బ్యూటీ

  • September 7, 2019 / 01:22 PM IST

ఇప్పటికే తన లవర్ తో బ్రేక్ అప్ అయ్యిందని… గోవా బ్యూటీ ఇలియానా గురించి తెగ డిస్కషన్లు జరుగుతున్నాయి. తన ఎక్స్ లవర్ అండ్రూ గురించే అందరూ కామెంట్లు చేసి ఆమెను విసిగిస్తున్నారు. ఈ డిస్కషన్ల నుండీ నెటిజెన్లని డైవర్ట్ చేయడం కోసం తన బికినీ ఆల్బమ్ నుండీ ఒక్కో ఫోటోని బయటకి పెడుతుంది ఈ గోవా బ్యూటీ. తన ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ 152 వ చిత్రం కొరటాల డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇలియానాను హీరోయిన్ గా అనుకుంటున్నారని వార్తలొచ్చాయి. అయితే ‘నీ పర్సనాలిటీ అస్సలు హీరోయిన్ లానే లేదు… వేస్ట్’ అంటూ హద్దులు మీరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇలియానాకు బాగా కోపం వచ్చినట్టు ఉంది. ఆ కామెంట్స్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది.

ఓ పాప్ సింగర్ డెమి లొవాటో ఫోటోను ఇల్లీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ “అందరికీ ఒక చిన్న గమనిక. మీరెలా కనిపిస్తున్నారనే విషయంలో ఊరికే ఇబ్బంది పడకండి. మీ శరీరాన్ని ఎలా ఉందో అలానే స్వీకరించండి. మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే దిశగా పని చేయండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆ ఫొటోలో బికినీ ధరించి ఉన్న పాప్ సింగర్ డెమి విషయానికి వస్తే… ఆమె బొద్దుగానే ఉంది.. ఏమాత్రం స్లిమ్ గా లేదు. ఈమెను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ‘అందంగా కనిపించడం.. జనాలకు నచ్చినట్టు పర్ ఫెక్ట్ షేప్ లో ఉండడం’ వంటి కామెంట్స్ తో విరక్తి చెంది… ఆమె ఒరిజినల్ గా ఉండే బికినీ ఫోటో ను ధైర్యంగా పోస్ట్ చేసి.. “నేనింతే.. ఇది నా ఒరిజినాలిటీ. ఈ చెత్త డైట్లతో నేను ఫాలో అవ్వలేను.

కేకుకు బదులు పుచ్చకాయ ముక్కలను తినడం నా వల్ల కాదు..” అంటూ ఆ ఫోటోకి మ్యాటర్ రాసుకొచ్చింది. ఆ ఫోటో తెగ వైరల్ అయ్యింది. “ఎవరి కోసమో స్లిమ్ గా మారాల్సిన అవసరమేమీ లేదు.. నువ్వెలా ఉన్నావో అలానే ఉండు” అంటూ డెమీకి చాలా మంది నెటిజన్లు మద్దతు పలుకుతూ కామెంట్స్ చేశారు. ఈ డెమీ ఫోటోని అవకాశంగా తీసుకుని ‘మీ శరీరం ఎలా ఉందో అలానే స్వీకరించండి’ అంటూ కామెంట్ పెట్టి తనని ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు ఇలియానా ‘చల్ ఫుట్’ అని సున్నితంగా కౌంటర్ ఇచ్చిందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus