పవన్ కళ్యాణ్ కి నేను ఎందుకు పోటీ వస్తాను ?

  • February 27, 2019 / 12:44 PM IST

పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొని తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా బ్రతుకుతున్న రేణుదేశాయ్ ను ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా లేదా పోటీగా రాజకీయాల్లోకి లాగుదామని గత కొంత కాలంగా కొన్ని మీడియా వర్గాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. విడాకులు తీసుకున్నంత మాత్రాన తాను ఏమీ పవన్ కళ్యాణ్ మీద కోపంగా లేనని, ఇప్పటికీ పవన్ అంటే తనకు ఇష్టం, గౌరవం అని రేణు ఒకటికి పడిసార్లు చెప్పింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే పడనివాళ్లు ఆమెను ఈ రొచ్చులోకి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల రేణుదేశాయ్ సాక్షి టీవీ స్వప్నతో కలిసి ఒక ప్రోగ్రామ్ చేయడానికి సమ్మతించిన విషయం తెలిసిందే.

అయితే.. సాక్షి టీవీ చానల్ జగన్ ది కాబట్టి.. రేణుదేశాయ్ జగన్ పార్టీలో చేరబోతోందని.. ఏకంగా పవన్ కళ్యాణ్ కు పోటీగా కూడా నిలుస్తుంది అని వార్తలు రావడం మొదలయ్యాయి. దాంతో వెంటనే స్పందించిన రేణు దేశాయ్.. “అసలు నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు కేవలం రైతు కష్టాలను ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత, అవసరం ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగామ్ చేయడానికి ఒప్పుకున్నాను. అంతే తప్ప నేను రాజకీయాల్లోకి వస్తున్నానని కొన్ని న్యూస్ చానల్స్ లో వస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ కి పోటీగా నేను ఎందుకు వస్తాను? చెప్పండి” అని క్లారిటీ ఇచ్చేసింది రేణు దేశాయ్. మరి ఇప్పటికైనా ఆమె పోలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న అవాస్తవ కథనాలకు తెరపడుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus