శ్రీహాన్ శ్రీసత్యల విషయంలో రేవంత్ అంత మాట అన్నాడా.?

  • November 13, 2022 / 02:12 PM IST

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ కోసం హౌస్ మేట్స్ ఎంతగా ఎదురుచూస్తారో, బయట ఉన్న ప్రేక్షకులు కూడా అంతే ఎదురుచూస్తారు. చాలామందికి శనివారం హౌస్ మేట్స్ కి క్లాస్ పీకాలని, వాళ్ల గేమ్ ని సరిచేయాలని ఉంటుంది. అనుకున్నట్లుగానే నాగార్జున ఆ పాయింట్స్ ని అడ్రస్ చేసి క్లాస్ పీకుతారు. ఇందులో భాగంగా 10వ వారం ఇనాయకి క్లాస్ పడింది. గేమ్ లో జస్ట్ లైక్ దట్ F*** అనే పదం ఎక్కువగా వాడుతున్నావని, లాస్ట్ టైమ్ కూడా ఇదే విషయంలో నిన్ను హెచ్చరించానని చెప్పాడు.

దీనికి ఇనాయ సారీ చెప్పింది. అలాగే, రేవంత్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యావ్ అని, కన్ఫూజ్ అయిపోయావని చెప్పాడు. ఇక్కడే ఫైమా ఇంకా మిగతా వాళ్లు రేవంత్ వీక్ నెస్ లో ఎలా ఆడుకున్నారనేది వీడియో చూపించారు. రేవంత్ ఫిజికల్ అవ్వొద్దని చెప్పాను కానీ, ఆటలో దూసుకుని వెళ్లొద్దని అలాగే ఎగ్రెసివ్ అవ్వద్దని నేను చెప్పలేదంటూ నాగార్జున రేవంత్ కి చిన్నసైజ్ క్లాస్ పీకారు. ఇక్కడే శ్రీసత్య, శ్రీహాన్ ఇద్దిరితో ఫ్రెండ్షిప్ అనేది బాగుంది కానీ, నువ్వు అప్పుడప్పుడు మాటలు అనేస్తున్నావ్ అని హెచ్చరించాడు. అసలు రేవంత్ ఏమన్నాడంటే.,

శ్రీహాన్ బెడ్ పైన పడుకున్నప్పుడు రేవంత్ పిలిస్తే శ్రీహాన్ రాలేనని అన్నాడు. దీంతో మేము పిలిస్తే ఎందుకు వస్తావ్ పిలవాల్సినవాళ్లు పిలిస్తే దుప్పటి లాక్కుని మరీ వెళ్లిపోతావ్ అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో శ్రీహాన్ మార్నింగ్ రేవంత్ ని అలా మాట్లాడద్దని చెప్పాడు. కొంచెంసేపు ఆర్గ్యూ చేసిన రేవంత్ తర్వాత మాత్రం శ్రీహాన్ కి సారీ చెప్పాడు. ఇదే విషయాన్ని నాగార్జున రేవంత్ కి క్లాస్ పీకాడు. అంతేకాదు, సంచాలక్ గా చాలా కన్ఫూజ్ అయిపోయావంటూ , హౌస్ మేట్స్ ని ఇబ్బందికి గురి చేశావని చెప్పాడు.

నిజానికి రోహిత్ కి కెప్టెన్సీ టాస్క్ లో అన్యాయం జరిగిందని చెప్పాడు. రోహిత్ గేమ్ ఆడేటపుడు మిగతా వాళ్లు కూడా బ్యాగ్ ని పట్టుకున్నారని చెప్పాడు. ఇక రేవంత్ ఆట ఎలా ఉందో అతని వీక్ నెస్ ని అవతలి టీమ్ ఎలా క్యాష్ చేస్కుందో రేవంత్ కి తెలిసేలా వీడియో కూడా చూపించాడు నాగార్జున. కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ ఎందుకు అలా సంచాలక్ గా ఆడించాల్సి వచ్చిందని ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. కానీ, దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత ఆదిరెడ్డి ఇనయపై అరిచింది,

మీద మీదకి వెళ్లి మాట్లాడినదాన్ని కూడా క్లాస్ పీకాడు కింగ్ నాగార్జున. ఈగో ఉంటే అలాగే వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ ని డాక్టర్స్ గా చేసి ఎవరికి ఏ వ్యాధి ఉందో బోర్డ్ వేసి టానిక్ తాగించమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ ఒకరికొకరు బోర్డులు మెడలో వేసుకున్నారు. శనివారం అనూహ్యంగా బాలాదిత్యని ఎలిమినేట్ చేశారు. ఆదివారం మరో ఎలిమినేషన్ అంటూ షోని ముగించాడు. అయితే, ఇక్కడే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలాదిత్యతో పాటుగా ఈవారం వాసంతీ కూడా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. అదీ మేటర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus