Ram Charan, Shankar, Kamal: చరణ్‌ ఫ్యాన్స్‌కి షాక్‌.. నిర్మాత కూడా మారారు!

  • August 24, 2022 / 02:58 PM IST

రామ్‌చరణ్ అభిమానులు భయపడుతూ అనుకున్నది అయిపోయింది. చరణ్‌ సినిమాను ఆపేసి.. శంకర్‌ ‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌ మొదలెట్టేశారు. దిల్‌ రాజు, శంకర్‌ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కమల్‌ హాసన్‌ ‘ఇండియన్ 2’ సినిమా అయితే మొదలైపోయింది. దీనికి సంబంధించి చిత్రబృందం ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ట్విటర్‌లో పోస్టర్లు పెడుతూ రాసుకొచ్చింది. ఈ రోజు నుండి సినిమా షూటింగ్‌ తిరిగి మొదలుపెడుతున్నాం అని రాసుకొచ్చారు. ఎరుపు రంగు బ్యాగ్రౌండ్‌లో, వైట్‌ డ్రెస్‌ వేసుకున్న కమల్‌ హాసన్‌ ఫొటోను షేర్‌ చేస్తూ సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌ను ఇచ్చింది చిత్రబృందం.

బ్యాలెన్స్‌ పార్ట్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం అంటూ రాసుకొచ్చారు. దాంతోపాటు సినిమాకు సంబంధించి మరో మేజర్‌ అప్‌డేట్‌ కూడా బయటికొచ్చింది. దాని ప్రకారం ఈ సినిమా నిర్మాతగా ఉదయ్‌నిధి స్టాలిన్‌ వచ్చి చేరారు. ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ రెడ్‌ జెయింట్‌ కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా మారింది. ఇక ఈ భారీ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనిరుథ్‌ సంగీత దర్శకుడు. ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను కొన్నేళ్ల క్రితం ప్రారంభించారు.

అయితే షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో చిత్రబృందంలో కొందరు మృతిచెందారు. దీనిపై నిర్మాతలు, శంకర్‌, కమల్‌ హాసన్‌ మధ్య వివాదం రాజుకుంది. సినిమా షూటింగ్‌ విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉండటంతో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత పలుదఫాలుగా చర్చలు జరిగినా ఈ సినిమా ముందుకెళ్లలేదు. అయితే అన్నీ ఓకే అయ్యి సినిమా మొదలుపెడదాం అనుకున్నారు.

ఆ సమయంలో కరోనా పరిస్థితులు రావడంతో సినిమా షూటింగ్‌ అవ్వలేదు. ఆ తర్వాత శంకర్‌, రామ్‌చరణ్‌ సినిమాలోకి వచ్చేశారు. కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ‘ఇండియన్‌ 2’ సినిమా త్వరలో ప్రారంభిస్తామని కమల్‌ చెప్పారు. అయితే రామ్‌చరణ్‌ సినిమా అయ్యాక ఉంటుంది అని అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఏకంగా చరణ్‌ సినిమాను ఆపేసి మరీ శంకర్‌ కమల్‌ సినిమాకు వచ్చేశారు. మరి దీని వెనుక ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus