మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రం ‘ఇంద్ర’ (Indra) . ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బి.గోపాల్ (B. Gopal) ఈ చిత్రానికి దర్శకుడు. చిరుకి జోడీగా ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal), సోనాలి బింద్రె (Sonali Bendre) నటించారు. 2002 వ సంవత్సరం జూలై 24న ‘ఇంద్ర’ రిలీజ్ అయ్యింది. అంటే నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్లు పూర్తి కావస్తోంది. వాస్తవానికి ‘మృగరాజు’ (Mrugaraju) ‘శ్రీ మంజునాథ’ ‘డాడీ’ (Daddy) వంటి చిత్రాలు నిరాశపరచడంతో ‘ఇంద్ర’ పై మొదట పెద్దగా హైప్ లేదు.
కానీ మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా వల్ల ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. నేటితో 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో.. ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.15 cr |
సీడెడ్ | 6.25 cr |
ఉత్తరాంధ్ర | 2.70 cr |
ఈస్ట్ | 2.15 cr |
వెస్ట్ | 2.00 cr |
గుంటూరు | 2.42 cr |
కృష్ణా | 2.13 cr |
నెల్లూరు | 1.35 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 26.15 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.55 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.70 cr |
‘ఇంద్ర’ రూ.17 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఎవ్వరూ ఊహించని విధంగా రూ.28.70 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.11.70 కోట్ల లాభాలు అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వచ్చే నెల.. అంటే ఆగస్టు 22న ‘ఇంద్ర’ సినిమా 4K లో రీ రిలీజ్ కానుంది. మరి ఈసారి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.