Indra Movie Collections: ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ కి 19 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
July 26, 2021 / 01:47 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో మొదటిసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన మూవీ ‘ఇంద్ర’. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2002 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రె హీరోయిన్లుగా నటించారు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.నేటితో ఈ చిత్రం విడుదలై 19 ఏళ్లు పూర్తికావస్తోంది. ‘మృగరాజు’ ‘శ్రీమంజునాథ’ ‘డాడీ’ వంటి చిత్రాలు నిరాశపరచడంతో ‘ఇంద్ర’ పై మొదట పెద్దగా అంచనాలు ఏమీ లేవు.కానీ ఈ చిత్రం అత్యథిక కలెక్షన్లు నమోదు చేయడమే కాకుండా 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి రికార్డులు క్రియేట్ చేసింది.
మరి బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
7.15 cr
సీడెడ్
6.25 cr
ఉత్తరాంధ్ర
2.70 cr
ఈస్ట్
2.15 cr
వెస్ట్
2.00 cr
గుంటూరు
2.42 cr
కృష్ణా
2.13 cr
నెల్లూరు
1.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
26.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
2.55 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
28.70 cr
‘ఇంద్ర’ చిత్రానికి రూ.17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.28.70 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.11.70 కోట్ల లాభాలు దక్కడం విశేషం.