ఇన్నాళ్లూ అభిమాన హీరో పుట్టిన రోజు నాడు టీవీలో ఆ కథానాయకుడి పాత సినిమానో, కొత్త సినిమానో వస్తే చూసేవాళ్లం. ఓటీటీలు వచ్చాక ఆ హీరో సినిమాల్ని బింజ్ వాచ్ చేసేస్తున్నారు. కానీ ఈ ఏడాది నుండి స్టైల్ మారింది అనుకోవద్దు. దీనికి ఆధ్యులు మహేష్‌బాబు ఫ్యాన్సే. మొన్న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ షోలకు మంచి స్పందన వచ్చింది. దీంతో అందరి చూపు ఆగస్టు 22 మీద పడింది.
ఆ రోజు చిరంజీవి పాత సినిమాలు థియేటర్‌లో చూడాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ‘ఇంద్ర’ సినిమాను విడుదల చేయాలంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ‘ఇంద్ర’ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఫ్యాన్స్ ఆనందపడే అంశం ఒకటి ఉంటే.. కాస్త నిరాశపడే అంశమూ ఒకటి ఉంది. ‘ఇంద్ర’ సినిమాను ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది గ్రాండ్ లెవల్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది.
అయితే.. ఇక్కడ చిన్న మెలిక పెట్టింది. ‘‘డియర్ మెగాస్టార్ ఫ్యాన్స్ ‘ఇంద్ర’ చిత్రాన్ని 4K వెర్షన్‌లో మీ ముందుకు తీసుకొస్తాం. అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఆ రోజు కోసం మీరే కాదు మేము కూడా ఎదురుచూస్తున్నాం. ఏది ఏమైనా ఈ సినిమా రీ రిలీజ్ గ్రాండ్ లెవల్‌లో ఉంటుంది’’ అని ట్వీట్‌లో పేర్కొంది వైజయంతి సంస్థ. వైజయంతి మూవీస్ ఇచ్చిన ఈ ట్వీట్‌పై అభిమానులు ఆనందంగా ఉన్నా.. ఆగస్టు 22న ఈ షో ఉండదు అని బాధపడుతున్నారు.
చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటి. వరుస పరాజయాలతో సతమవుతున్న వేళ ఈ ఫ్యాక్షన్ బేస్డ్ మూవీ.. అదిరిపోయే వసూళ్లు సాధించింది. చిరంజీవి సరసన సోనాలీ బింద్రే, ఆర్తి ఆగర్వాల్ నటించారు. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన 20 ఏళ్లు అవుతోంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?