Shalini Pandey: అర్జున్‌ రెడ్డి భామ బక్క చిక్కడానికి ఏం చేసిందో తెలుసా?

  • August 7, 2021 / 02:42 PM IST

అర్జున్‌ రెడ్డితో తెలుగు తెరకు పరిచమైన బొద్దు అందం షాలిని పాండే. సినిమా పాత్రకు తగ్గట్టగా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. సినిమా చూసి రిటర్న్‌ వస్తున్నప్పుడు విజయ్‌ దేవరకొండతోపాటు ఆమె కూడా మనసులోంచి వెళ్లదు. అయితే ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు ఆమెకు రాలేదు. ఆ తర్వాత ఏమైందో కానీ… ఒక్కసారి బక్కచిక్కిపోయింది. ఎంతగా అంటే… తరచి తరచి చూసినా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. దీని వెనుక కారణం, కష్టం ఇటీవల చెప్పిందామె.

చక్కనమ్మ చిక్కినా అందమే అంటుంటారు మన సినిమా పెద్దలు. గతంలో చాలామంది ఇలా తగ్గి మెరిపించారు. అలా తాజాగా మెరిసిపోతున్న అందం షాలిని పాండే అని చెప్పాలి. దానికి కారణం బాలీవుడ్‌ సినిమా అట. ‘జయేష్‌భాయ్‌ జోర్దాన్‌’ అనే సినిమాలో షాలిని పాండే నటిస్తోంది. ఆ సినిమా కోసమే ఆమె అమాంతం బరువు తగ్గిందట. ఆ సినిమాలో ఆమె డ్యాన్సర్‌ పాత్రలో కనిపిస్తోందట. దీంతో బరువు తగ్గి, సన్నబడాల్సిందే అని ఆ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా రూల్‌ పెట్టారట.

నిర్మాతల రూల్‌ అనో, ఇంకేదో కారణమో కానీ షాలిని పాండే కొన్ని నెలల్లోనే బరువు తగ్గిపోయింది. అల్ట్రాస్లిమ్‌ అయ్యి అదరగొట్టింది. దీని కోసం ఆమె ప్రత్యేకంగా ఓ డైట్‌ ప్లాన్‌ చేసుకుందట. అలాగే రోజుకు నాలుగు గంటలు డ్యాన్స్‌ చేసేదట. దీంతో తక్కువ సమయంలో బరువు తగ్గిందట. ఈ క్రమంలో పెద్ద ఇబ్బందులు కూడా ఏమీ ఎదురవలేదు అని చెప్పింది షాలిని.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus