Murari: మురారి మూవీ సమయంలో ఇంత జరిగిందా.. ఆ సాంగ్ కు ఒప్పుకోలేదా?
February 19, 2024 / 11:53 AM IST
|Follow Us
మహేష్ బాబు కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో మురారి ఒకటి. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా విడుదలై 23 సంవత్సరాలు కాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను, కీలక విషయాలను ఒక సందర్భంలో కృష్ణవంశీ పంచుకోగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రతి సినిమాలో విలన్ ను హీరో చంపడానికి ప్రయత్నిస్తాడని మురారి సినిమాలో మాత్రం విలన్ మనిషై ఉండకూడదని అనుకున్నామని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.
ఒక ఫోర్స్ ఉండాలని ఆ ఫోర్స్ ను ఎలా జయించాలో హీరోకు తెలియకూడదని భావించామని ఆయన అన్నారు. సినిమాలో చివరి నిమిషం వరకు థ్రిల్ పాయింట్ కొనసాగాలని హీరో గండం నుంచి ఎలా బయటపడతాడో అని ప్రేక్షకులు చివరి మూమెంట్ వరకు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉండాలని ఫీలయ్యామని కృష్ణవంశీ పేర్కొన్నారు. దేవుని కోపానికి కారణమైన వ్యక్తి శాపం నుంచి ఎలా బయటపడ్డాడనే కథతో మురారి తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.
మహేష్ రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుందని అందుకే మురారి (Murari) అనే టైటిల్ పెట్టామని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. మురారి మూవీలో అలనాటి రామచంద్రుడి సాంగ్ ను క్లైమాక్స్ లో ప్లాన్ చేశానని అందరూ ఆ సాంగ్ అక్కడ వద్దని చాలామంది చెప్పారని కృష్ణవంశీ కామెంట్లు చేశారు. ఆ పంచాయితీ కృష్ణగారి వరకు వెళ్లిందని ఆ సమయంలో అలనాటి సాంగ్ పెడితే ఆ పాట సంవత్సరాల తరబడి ఉంటుందని
మీ అబ్బాయి కెరీర్ కు కావాలంటే కమర్షియల్ సాంగ్ అనే చండాలాన్ని పెట్టుకోండి నేను వెళ్లిపోతా అని చెప్పానని కృష్ణవంశీ పేర్కొన్నారు. చివరకు నా మాటే నెగ్గిందని ఆయన కామెంట్లు చేశారు. కృష్ణవంశీ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.