Jayaram: ‘అల వైకుంఠపురములో’ ఫేమ్ జయరాం గురించి మనకు తెలియని విషయాలు..!
September 19, 2022 / 06:39 PM IST
|Follow Us
కమల్ హాసన్ పంచతంత్రం, తుపాకీ, భాగమతి, అల వైకుంఠపురం సినిమాలతో తెలుగువారికి సుపరితుడయ్యాడు జయరాం. మళయాళ నటుడైనప్పటికీ.. తమిళ, తెలుగు సినిమాల్లోనూ తన నటనతో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 1988లో అపరన్ అనే సినిమాతో జయరాం సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత మళయాళంలో వరసగా హిట్లు దక్కించుకుంటూ అక్కడ అగ్రహీరోల్లో ఒకరిగా స్థానందక్కించుకున్నారు. ఆ తర్వాత తమిళ సినిమాల్లో సైడ్ హీరోగా, కమెడియన్ గా కూడా రాణించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కావడం ఇందుకు పనికొచ్చింది.
దశాబ్దాల పాటు తన నటనతో అలరిస్తున్న జయరాంకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించడం విశేషం. ఇంతటి ప్రముఖ నటుడైనప్పటికీ.. ఆయన భార్య పార్వతి గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. ఆమె కూడా ఒకప్పటి టాప్ మళయాళం హీరోయిన్. 1992లో వీరిద్దరి ప్రేమ వివాహం జరిగింది. సుమారు 70 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పార్వతి, ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు. సినిమాలు తీస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిగురించిన పరిచయం ముదిరి ప్రేమ పెళ్లి వరకూ దారితీసింది.
వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు కాళిదాస్ ఇప్పటికే సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన జయరాం తనయుడు, చిన్నతనంలోనే జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. మలయాళంలో ప్రస్తుత యంగ్ హీరోల్లో కాళిదాస్ కు మంచి క్రేజ్ ఉంది.