“ఆదిత్య369” సినిమా గురించి మనకు తెలియని ఆసక్తికర విషయాలు!!
July 18, 2020 / 12:34 PM IST
|Follow Us
నందమూరి నట సింహం బాలకృష్ణ అంటే ఇండస్ట్రీ లో ఎంత గౌరావమో అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఆయన అంటే అంతే భయం కూడా. ఇదంతా పక్కన పెడితే బాలయ్య చేసిన కొన్ని కళా ఖండాలలో ‘ఆదిత్య369’ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అనే చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా ప్రభజనంగా మారి సూపర్ కలెక్షన్స్ ను సాధించడమే కాకుండా రికార్డ్స్‌ను సైతం సొంతం చేసుకుంది. ఇక శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య నటన అబ్బో….వార్ణించడానికి మాటలు సరిపోవు.
లెజెండరీ డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1991 జూలై18న రిలీజ్ అయ్యింది. అంటే నేటికి సరిగ్గా 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ సినిమా. అదే క్రమంలో అప్పట్లోనే గొప్ప సాంకేతిక విధానంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది అని సినిమాను చూస్తేనే అర్ధం అయిపోతుంది. సినిమాకు పిసి శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేశారు. ఇంగ్లిష్ రైటర్స్ రాబర్ట్ జెమెకిక్స్, హెచ్.జి వెల్స్ రచించిన టైం మిషిన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసర రావు.
బాలయ్య తన 100వ చిత్రంగా “గౌతమీ పుత్ర శాతకర్ణి” చేసిన విషయం తెలిసిందే. అసలైతే 100వ చిత్రంగా ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య999 చెయ్యాలి అని అనుకున్నాడు బాలయ్య కానీ, కుదరలేదు. అదే క్రమంలో ఆదిత్య999 సినిమాలో తన తనయుడిని లీడ్ రోల్ పెట్టి చేసే ఆలోచన చేస్తున్నాడట బాలయ్య. ఈ మధ్యనే దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు కూడా ఈ మాట చెప్పారు. సో మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఆదిత్య 369 సీక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న వాదన ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. మరి అదే నిజం అయితే బాలయ్య పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.