KGF2 Tickets: కేజీఎఫ్2 మూవీ మేకర్స్ చేస్తున్న తప్పు ఇదేనా?
April 12, 2022 / 04:06 PM IST
|Follow Us
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్2 సినిమా కోసం యశ్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్2 సినిమాకు నార్త్ లో రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సౌత్ లోని ఒక్కో రాష్ట్రంలో బుకింగ్స్ ఒక్కో విధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలో థియేటర్లలో కేజీఎఫ్2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజవుతున్న గురువారం రోజున బుకింగ్స్ బాగానే ఉన్నా శుక్రవారం తర్వాత రోజుల్లో మాత్రం బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కేజీఎఫ్2 తెలుగు వెర్షన్ పరిమిత సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితం కానుండగా కన్నడ వెర్షన్ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. అయితే కన్నడ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్ కే బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. కేజీఎఫ్2 తెలుగు వెర్షన్ ను తక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేస్తూ మేకర్స్ తప్పు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బెంగళూరులో కేజీఎఫ్2 ఫస్ట్ డే టికెట్స్ ఇప్పటికీ అందుబాటులో ఉండటం గమనార్హం.
తమిళనాడులో మాత్రం కేజీఎఫ్2 సినిమాకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. బీస్ట్ సినిమాకు సైతం ఇక్కడ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. కేరళలో కేజీఎఫ్2 ఫస్ట్ డే బుకింగ్స్ బాగున్నాయి. ఇక్కడ బీస్ట్ సినిమాకు మాత్రం బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. కేజీఎఫ్2 సినిమాకు టాక్ కీలకం కానుంది. మెజారిటీ ఆడియన్స్ టాక్ ను బట్టి ఈ సినిమాకు టికెట్లను బుకింగ్ చేసుకునే ఆలోచనలో అయితే ఉన్నారని తెలుస్తోంది. కేజీఎఫ్2 సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.
కేజీఎఫ్2 సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. యశ్ కెరీర్ కు కూడా కేజీఎఫ్2 సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.