Chandra Bose: పాటల రచయిత చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టొరీ

  • August 30, 2021 / 12:31 PM IST

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ప్రేమలు చిగురించడం సర్వసాధారణ విషయం. అందులో కొంతమంది ప్రేమ కథలు సినిమా కథల కంటే కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. అలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీలలో లవ్ చంద్రబోస్, సుచిత్ర కూడా ఉన్నారు. పాటల రచయిత చంద్రబోస్ ఏ స్థాయిలో గుర్తింపును అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మరోవైపు సూచిత్ర పాటలకు డ్యాన్స్ కంపోజింగ్ చేస్తూ మంచి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒకవైపు పాట మరొకవైపు నాట్యం ఇలా ఒకదానికొకటి సంబంధం ఉండే దారిలో కలిసి పని చేసిన ఈ ఇద్దరు ఒక ప్రయాణంలో కలుసుకుని ఆ తర్వాత పెళ్లి పీటల వరకు వచ్చారు. ఇద్దరు కలిసి ఒకే సినిమాకు పని చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి చంద్ర బోస్ కంటే కూడా సుచిత్ర సినిమా కెరీర్లో ఆరేళ్లు సీనియర్ అయినప్పటికీ ఏ మాత్రం భేదం లేకుండా ఏడు అడుగులు వేశారు. సినిమా ఇండస్ట్రీలో కొంత మంది ప్రముఖులు వీరి పెళ్లికి చాలా హెల్ప్ చేశారు.

మొదట ఎస్వీ కృష్ణారెడ్డి పెళ్లి పీటలు సినిమాకు చంద్రబోస్ పాటలు రాయగా.. సుచిత్ర ఆ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆ సినిమా కోసం హైదరాబాద్ టు చెన్నై ప్రయాణం చేయడంతో ఆ ట్రావెలింగ్ లోనే మంచి స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారింది. ఫస్ట్ చంద్రబోస్ ప్రపోజ్ చేశారట. అయితే ఆమె మొదట ఒప్పుకోక పోయినప్పటికీ ఆ తర్వాత చంద్రబోస్ తన ప్రేమను అర్థమయ్యేలా వివరించడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా పెళ్లి పీఠలు సినిమాతో వారు నిజంగానే పెళ్లి పీఠలు ఎక్కేశారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus