Prabhas: రాధేశ్యామ్ మూవీ క్లైమాక్స్ అలా ఉండబోతుందా?

  • November 5, 2021 / 05:33 PM IST

బాహుబలి2, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధేశ్యామ్ సినిమాలో నటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో కొంతమంది షాకయ్యారు. దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ తొలి సినిమా జిల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో రాధేశ్యామ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ టీజర్ రాధేశ్యామ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రేక్షకుల్లో నమ్మకాన్ని పెంచింది. రాధేశ్యామ్ క్లైమాక్స్ గురించి గత కొన్ని నెలలుగా అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మనోజ్ పరమహంస రాధేశ్యామ్ క్లైమాక్స్ స్పెషల్ గా ఉంటుందని ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా క్లైమాక్స్ ద్వారా ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పబోతున్నామని మనోజ్ పరమహంస చెప్పుకొచ్చారు. యాక్షన్ సన్నివేశాలతో 15 నిమిషాల పాటు ఈ సినిమా క్లైమాక్స్ ఉండబోతుందని సమాచారం. దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించారని తెలుస్తోంది.

తెలుగు, హిందీతో పాటు ప్రముఖ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజైన వారం రోజుల తర్వాత రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుండటం గమనార్హం. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus