త్వరలోనే తన కూతురు పెళ్లిని ఘనంగా చేయనున్న వెంకటేష్!
November 8, 2018 / 10:09 AM IST
|Follow Us
విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు ఎలాంటి వివాదాస్పద వివాదాల్లో చిక్కుకోలేదు. తన సినిమాలు ఏంటో తన పని ఏంటో అంతవరకే ఉంటూ మీడియా కి ఎప్పుడు దూరంగానే ఉంటాడు. అతడిలానే ఆయన ఫ్యామిలీ కూడా అసలు బయట కనిపించిన సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు. వెంకటేష్ కూతురు ఆశ్రిత కి సినిమాల పైన ఆసక్తి అనేది లేదంట, ఫుడ్ అండ్ ట్రావెల్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉండటంతో ఫుడ్ బిజినెస్ రంగాన్ని ఎంచుకుంది. ఇది ఇలా ఉంటె, వెంకటేష్ కూతురు ఆశ్రిత ఒక అతడిని ఇష్టపడగా వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒకే చెప్పేసాయని, ముహూర్తం కూడా ఖరారు అయిందని తెలుస్తుంది.
వెంకటేష్ కూతురు ఆశ్రిత కి, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనువడితో పెళ్లి నిశ్చయం కాగా నవంబర్ 24 న వీరి వివాహం జరుగునున్నట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లోనే రామానాయుడు స్టూడియో లో పెళ్లి కోసం భారీ సెట్ వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి సంబరాలు మొదలుపెట్టిన దగ్గుపాటి వారు పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో నే వెల్లడించే అవకాశం ఉంది.